గుడ్ న్యూస్: అరుణాచలం గిరి ప్రదర్శనకు ప్రత్యేక బస్సులు

  •     19 నుంచి 22 వరకు వివిధ ప్రాంతాల నుంచి బస్సులు నడపనున్న సంస్థ

హైదరాబాద్, వెలుగు: తమిళనాడులోని అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ప్యాకేజీతో అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ నెల 21న గురు పౌర్ణమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణలోని హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

ఈ నెల 19వ తేది నుంచి 22వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడపనున్నట్టు తెలిపారు. ఈ ప్యాకేజీలో కాణిపాక వరసిద్ధి వినాయక స్వామితో పాటు శ్రీపురంలోని గోల్డెన్ టెంపుల్ సందర్శించే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. అరుణాచల గిరి ప్రదక్షిణ ప్యాకేజీ బుకింగ్ కోసం tsrtconline.in వెబ్‌‌సైట్‌‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.