గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్ష కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులు

గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్ష కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులు

గ్రూప్ -1 ప్రిలిమనరీ పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యార్థం TGSRTC ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అభ్యర్థులకు రవాణాపరంగా అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రాష్ట్రంలోని 897 పరీక్షా కేంద్రాలకు బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే సంస్థ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.

 హైదరాబాద్  నుంచి జిల్లాలకు ఇవాళ సాయంత్రం నుంచే అభ్యర్థుల రద్దీ ఎక్కువగా ఉన్నందున.. ఎంజీబీఎస్ , జేబీఎస్ , ఉప్పల్ , ఎల్బీనగర్ , ఆరాంఘర్  పాయింట్ల దగ్గర అన్ని ఏర్పాట్లు చేసింది ఆర్టీసీ.  ట్రాఫిక్  జనరేటింగ్  పాయింట్లలో ప్రత్యేక అధికారులను నియమించారు.రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంటాయంటు ట్వీట్ చేశారు TGSRTC ఎండీ సజ్జనార్. 

రాష్ట్రంలోని ప్రధాన బస్  స్టేషన్లలో May I Help You  కౌంటర్లను సంస్థ ఏర్పాటు చేసింది. అక్కడ పరీక్షా కేంద్రాల సమాచారాన్ని అభ్యర్థులకు ఇవ్వడంతో పాటు ఏ బస్సులో వెళ్లాలో అధికారులు చెప్తారు. రాష్ట్రవ్యాప్తంగా 4లక్షల 3వేల  మంది విద్యార్థులు గ్రూప్-1 ప్రిలిమినరీకి హాజరవుతుండగా.. అందులో గ్రేటర్  హైదరాబాద్ లోనే దాదాపు లక్షా 70వేల మంది పరీక్ష రాస్తున్నారు. వారికీ రవాణాపరంగా అసౌకర్యం కలగకుండా రద్దీకి అనుగుణంగా సిటీ బస్సులను అందుబాటులో ఉండనునట్టు తెలిపారు సజ్జనార్.