గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. TGSRTC స్పెషల్ బస్సులు

గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. TGSRTC స్పెషల్ బస్సులు

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల (డిసెంబర్) 15, 16వ తేదీల్లో గ్రూప్- 2 పరీక్షలు జరగన్నాయి. గ్రూప్-2 పరీక్షలకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో గ్రూప్-2 అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ కీలక సూచన చేసింది. ఎగ్జామ్ నేపథ్యంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రూప్2 ఎగ్జామ్‎కు వెళ్ళే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది ఆర్టీసీ.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఎగ్జామ్ సెంటర్లకు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీస్‎లను ఏర్పాటు చేసినట్లు గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వెల్లడించారు. గ్రూప్ 2 పరీక్ష జరగనున్న15, 16 రెండు రోజుల పాటు స్పెషల్ సర్వీస్ ఎగ్జామ్స్ సెంటర్స్ వద్ద అందుబాటులో ఉంటాయని తెలిపారు. పరీక్ష ప్రారంభ సమయానికి ముందు.. పరీక్ష ముగిసిన తర్వాత సమయాల్లో ఈ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 

బస్టాప్‎ల దగ్గర హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు  చేశామని.. అభ్యర్థులను సందేహాలను  నివృత్తి చేసేందుకు హెల్ప్ డెస్క్ ల్లో సూపర్ వైజర్లు అందుబాటులో ఉంటారని వెల్లడించారు. స్పెషల్ బస్ సర్వీసుల వివరాలు తెలుసుకునేందుకు కోఠి, రైతిఫల్ బస్టాండ్‎లో కమ్యూనికేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రూప్ 2 అభ్యర్థులు ఈ స్పెషల్ బస్ సర్వీసులకు ఉపయోగించుకోవాలని కోరారు.