
తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి ఘనంగా నిర్వహిస్తారు. ఆ పర్వదినాన శైవ క్షేత్రాలు భక్తులతో కిటకి టలాడుతాయి. ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు బారులు తీరుతారు. తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి భక్తులు శైవ క్షేత్రాలకు పొటెత్తుతారు
ఈ క్రమంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ ఆలయాలకు ఫిబ్రవరి 25 నుంచి 28 వ తేదీ వరకు స్పెషల్ బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి కీసరగుట్ట, ఏడుపాయల, బీరంగూడ జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపింది.
స్పెషల్ బస్సులు ఇలా..
- సికింద్రాబాద్ (రెజిమెంటల్ బజార్) నుంచి 90 బస్సులు ,ECIL X రోడ్డు నుంచి 100, , అమ్ముగూడ నుంచి 70, ఉప్పల్ X రోడ్ నుంచి కీసరకు మొత్తం 285 బస్సులు నడుస్తాయి
- సీబీఎస్ నుంచి ఏడుపాయల జాతరకు మొత్తం 125 బస్సులు నడవనున్నాయి.
- బీరంగూడ నుంచి పటాన్ చెరుకు మొత్తం 30 బస్సు సర్వీసులను నడుపనున్నారు