టీజీఎస్​ ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

టీజీఎస్​ ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వరంగల్‌‌‌‌‌‌‌‌లోని టీజీఎస్​ఆర్టీసీకి చెందిన ఐటీఐ కళాశాలల్లో వివిధ ట్రేడ్‌‌‌‌‌‌‌‌లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.10వ తరగతి వరకు చదివిన విద్యార్థులు జూన్ 10వ తేదీలోపు ఆన్ లైన్ (https://iti.telangana.gov.in/) లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.

మోటార్‌‌‌‌‌‌‌‌ మెకానిక్‌‌‌‌‌‌‌‌ వెహికిల్‌‌‌‌‌‌‌‌, మెకానిక్‌‌‌‌‌‌‌‌ డీజిల్‌‌‌‌‌‌‌‌, వెల్డర్‌‌‌‌‌‌‌‌, పెయింటర్‌‌‌‌‌‌‌‌ ట్రేడ్‌‌‌‌‌‌‌‌లలో ప్రవేశాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే వారు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఐటీఐ కాలేజీ ఫోన్‌‌‌‌‌‌‌‌ నంబర్లు 9100664452, 040-23450033, వరంగల్‌‌‌‌‌‌‌‌ ఐటీఐ కాలేజీ ఫోన్‌‌‌‌‌‌‌‌ నంబర్లు 9849425319, 8008136611 ను సంప్రదించాలన్నారు.