TGSRTC: దసరాకు 5304 స్పెషల్ బస్సులు

TGSRTC: దసరాకు 5304 స్పెషల్ బస్సులు

హైదరాబాద్: ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్.  దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) 5304 స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించింది.  హైదరాబాద్ నుంచి  విజయవాడ, బెంగళూరు ఇతర ప్రాంతాలకు ఈ  బస్సులు నడవనున్నాయి.   అక్టోబరు 1 నుంచి 15 వరకు ఈ ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయి.  పండుగ సీజన్‌లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని ఆర్టీసీఎండీ సజ్జనార్ తెలిపారు.

దసరా ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లపై  టీజీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ అధికారులతో సెప్టెంబర్ 30వ  సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజిబిఎస్), జూబ్లీ బస్ స్టేషన్ (జెబిఎస్), ఎల్‌బి నగర్, ఉప్పల్, సంతోష్ నగర్,  కెపిహెచ్‌బి నుంచి ప్రత్యేక RTC బస్సులు బయలుదేరుతాయని  చెప్పారు.   ఇక ఐటీ కారిడార్ ఉద్యోగుల కోసం బస్సులు  గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ (ORR) మీదుగా విజయవాడ,బెంగళూరు వంటి ప్రాంతాలకు నడవనున్నాయి. 

ALSO READ | ఆఫర్స్ కంటిన్యూ: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్

అక్టోబరు 12న దసరా కావడంతో..  అక్టోబర్ 9, 10, 11 తేదీల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున..డిమాండ్‌కు అనుగుణంగా హైదరాబాద్ అంతటా అదనపు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.