
హైదరాబాద్సిటీ, వెలుగు: ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ల కోసం గ్రేటర్ లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
గురువారం ( మార్చి 27 ) , ఏప్రిల్6, ఏప్రిల్12, 23, మే 5, 10, 20, 21 తేదీల్లో జరిగే మ్యాచ్లకు సిటీలోని 24 డిపోల నుంచి ఉప్పల్స్టేడియానికి 60 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఆయా రూట్లలో సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు అందుబాటులో ఉంటాయన్నారు