![దీన్ని కూడా తాగుతారా : మొసలి రక్తం తాగితే.. నిత్య యవ్వనం..](https://static.v6velugu.com/uploads/2023/05/thailand-man-drinks-crocodile-blood-twice-a-day_0OmFBYpv2j.jpg)
90 ఏళ్ల ముసలి వారు కూడా యవ్వనంగా ఉండేందుకు చేసే ప్రయత్నాలు అంతా ఇంతా కాదు.. కొంతమంది వయస్సు బయటపడకుండా ఉండేందుకు జుట్టుకు రంగేసుకుంటే.. మరికొంతమంది స్కిన్ కు కొన్ని ప్రత్యేకమైన ఆయిల్స్ ను వాడతారు. ఇప్పుడు తాజాగా మొసలి రక్తం తాగితే వారి యవ్వనాన్ని తిరుగులేదంటున్నారు ఓ వ్యాపారి.
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ యవ్వనంగా ఉండేందుకు పాము రక్తం తాగాడని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అందులో ఎంత నిజం ఉందో తెలియదు కాని ... ఫిట్‌గా ఆరోగ్యంగా ఉండేందుకు తాను రోజూ రెండుసార్లు మొసలి రక్తాన్ని తాగుతానని దక్షిణ థాయ్‌లాండ్‌లో నివసిస్తున్న ఒక వ్యాపారవేత్త తెలిపాడు.
మొసలి రక్తం.. ఎంతో బలం..
థాయిలాండ్‌లోని ట్రాంగ్ ప్రావిన్స్‌కు చెందిన 52 ఏళ్ల రోజాకోర్న్ నైనోన్ మొసలి రక్తంలో లావో ఖావో అనే థాయ్ స్పిరిట్‌ని కలిపి రోజు ఉదయాన్నే తాగుతానని తెలిపాడు. రాత్రి పడుకునే ముందు కూడా ఈ కాక్టెయిల్‌ను ఇష్టపడతాడట. ఇది తాగకముందు అతను శారీరకంగా బలహీనంగా, అలసిపోయినట్లు ఉండేవాడినని రోజాకార్న్ తెలిపాడు. మొసలి రక్తం తాగడం ప్రారంభించినప్పటి నుంచి తాను ఎప్పుడూ అలసిపోలేదన్నాడు. మొసలి రక్తం శరీరంలోని అనేక అవయవాలకు, నాడీ వ్యవస్థకు ఒక అద్భుతంలా పనిచేస్తుందని తెలిపాడు.
ఒక కాక్టెయిల్ ధర రూ. 800
కూరగాయలు, పండ్లు మరియు పువ్వుల మాదిరిగానే, మొసళ్లను కూడా థాయిలాండ్‌లో ఒకే చోట పెంచుతారు. థాయ్ లాండ్ ఫామ్‌హౌస్‌ల్లో లక్షలాది మొసళ్లను పెంచుతారు. క్రోక్స్‌లో రక్తం చాలా తక్కువ ఉంటుందని ఓ ఫామ్‌హౌస్ యజమాని వనచాయ్ చికార్డ్ పేర్కొన్నారు. అందుకే ఇందులో లావో ఖావో లాంటి ఆల్కహాల్‌ను కలుపుకుని తాగాలి. ఈ కాక్‌టెయిల్ ఒక పెగ్ ధర రూ.800 వరకు ఉంటుంది.
ఇది తాగారా.. ఇక మిమ్మలను ఎవరూ ఆపలేరు..
ట్రాంగ్ ప్రావిన్స్‌లోని అతిపెద్ద మొసళ్ల ఫారమ్ యజమాని వనాచై ఈ కాక్‌టెయిల్ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని తెలిపారు. ఎర్ర రక్త కణాలను , ప్లేట్‌లెట్ కౌంట్ , తెల్ల రక్త కణాలు తగ్గకుండా మంచి ఔషధంగా పనిచేస్తుందని వనాచై అన్నారు. ఈ కాక్ టెయిల్ స్పెర్మ్ కణాలను బలోపేతం చేయడానిని ఉపయోగపడుతుంది. దీన్ని తాగడం వల్ల సంతానలేమి సమస్య కూడా దూరమవుతుందని ఆయన తెలిపారు.
ఒక మొసలి నుండి 100 ml రక్తం మాత్రమే ..
మూడు , నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్న మొసళ్లను కాక్టెయిల్ కోసం చంపుతారు. అవి బలంగా ఉన్నప్పుడు వాటి రక్తం అత్యంత శక్తివంతమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఒక జంతువు నుండి 100 మి.లీ. రక్తం మాత్రమే లభ్యమవుతుంది. మొసళ్ల చర్మం, మాంసం , రక్తం చాలా ఖరీదైనవి. అందుకే వీటిని వ్యాపారం కోసం పెంచుతారు.
వెయ్యికి పైగా మొసళ్ల ఫామ్‌హౌస్‌లు
థాయ్‌లాండ్‌లో వెయ్యికి పైగా మొసళ్ల ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. ఇక్కడ సుమారు 1.2 మిలియన్ మొసళ్లను పెంచుతున్నారు. వీటి ద్వారా పిత్త ,రక్త ఔషధం కూడా తయారు చేస్తారు. పిత్తం ఖరీదు కిలో రూ.76 వేలు. మాంసం కిలో రూ.570కి విక్రయిస్తున్నారు. హ్యాండ్ బ్యాగులు, లెదర్ సూట్లు, బెల్టులు వంటి వాటిని మొసళ్ల చర్మంతో తయారు చేస్తారు.