బ్యాంకాక్ : ఇండియా స్టార్ షట్లర్, వరల్డ్ మాజీ నంబర్ వన్ కిడాంబి శ్రీకాంత్ థాయ్‌లాండ్ మాస్టర్స్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్స్‌లో శ్రీకాంత్ 17–21, 16–21తో ఆరో సీడ్ జెంగ్ జింగ్ వాంగ్ (చైనా) చేతిలో వరుస గేమ్స్‌లో పరాజయం పాలయ్యాడు.
మరో మ్యాచ్‌లో శంకర్ 21–19, 18–21, 13–21తో చైనాకే చెందిన జువాన్ చెన్ జు చేతిలో, మెన్స్ డబుల్స్‌లో ఎనిమిదో సీడ్స్ పృథ్వి కృష్ణమూర్తి–సాయి ప్రతీక్ 19–21, 18–21తో రెండో సీడ్స్ ఫిక్రి–మార్టిన్ (ఇండోనేసియా) చేతిలో ఓడారు. విమెన్స్ సింగిల్స్‌లో రష్మితా కూడా వెనుదిరిగింది.