రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని థాయ్ లాండ్ కోర్టు ఆ దేశ ప్రశాని స్రెట్టా థావిసిస్ ను పదవి నుంచి తొలగించింది.కేబినెట్ నియామకంపై రాజ్యాంగం నైతిక నిబంధన లను ఉల్లంఘించారని కోర్టు తెలిపింది. తన కేబినెట్ లో క్రిమినల్ రికార్డు ఉన్న న్యాయవాదిని ఎంపిక చేయడం ద్వారా స్రెత్తా నిబంధనలు ఉల్లంఘించారని కోర్టు తెలి పింది. థాయ్ లాండ్ మాజీ సెనెటర్లు వేసి పిల్ ను విచారించిన కోర్లు స్రెత్తాను ప్రధాని పదవి నుంచి తొలగించింది.
గత ఏడాది ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకుని థాయ్ లో స్రెత్తా నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ప్రోగ్రెసివ్ మూవ్ ఫార్వర్డ్ పార్టీ. అయితే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని స్రెత్తా ప్రభుత్వాన్ని థాయ్ కోర్టు రద్దు చేసింది. కోర్టులోని మొత్తం తొమ్మిదిమంది న్యాయమూర్తుల్లో ఐదుగురు స్రెత్తాను ,అతని మంత్రి వర్గాన్ని తొలగించాలని ఓటు వేశారు. స్రెత్తా తొలగింపు తర్వాత ప్యూథాయ్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.