భూకంపం : థాయ్లాండ్లో మెట్రో, ఎయిర్ పోర్ట్, స్టాక్ ఎక్స్చేం జ్ అన్నీ మూసివేత

భూకంపం : థాయ్లాండ్లో మెట్రో, ఎయిర్ పోర్ట్, స్టాక్ ఎక్స్చేం జ్ అన్నీ మూసివేత

దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది థాయ్ లాండ్ ప్రభుత్వం. అత్యవసర సర్వీసులు తప్పితే మిగతా అన్నింటినీ మూసివేసింది. భారీ భూకంపం తర్వాత జరిగిన విధ్వంసంపై సహాయ చర్యలు ముమ్మరం చేసింది. సైన్యాన్ని రంగంలోకి దించింది. బ్యాంకాంక్ లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేసింది. మెట్రో సర్వీసులను సస్పెండ్ చేసింది. రైలు సర్వీసులను నిలిపివేసింది. వరసగా వచ్చిన రెండు భారీ భూకంపాలతో విధ్వంసం భారీగా ఉండటంతో విద్యుత్ ఉత్పత్తి.. పవర్ స్టేషన్లు కొన్నింటిని తాత్కాలికంగా షట్ డౌన్ చేసింది. థాయ్ లాండ్ స్టాక్ ఎక్చేంఛ్ ను క్లోజ్ చేసింది. 

థాయ్ లాండ్ దేశ వ్యాప్తంగా వేలాది భవనాలు నిట్టనిలువునా కూలిపోయాయి. అధికారికంగా 25 మంది చనిపోయినట్లు ప్రభుత్వం చెబుతున్నా.. ఈ సంఖ్య వేలల్లో ఉండొచ్చుని.. మరణాలు సంఖ్య భారీగా ఉండొచ్చని చెబుతున్నారు అధికారులు. ఆస్తి నష్టాన్ని అంచనా వేయటం అనేది అంచనాలకు, ఊహకు అందని విధంగా ఉంది.

శుక్రవారం (మార్చి 28) వరుసగా 7.7, 8.7 తీవ్రతతో వచ్చిన భూకంపాలు మయన్మార్ ను నేలమట్టం చేశాయి. పెద్దపెద్ద భవనాలు, వంతెనలు కూలిపోవడంతో దారుణం పరిస్థితులు ఏర్పడ్డాయి.  మయన్మార్ భూకంపం ప్రపంచ దేశాలను ఒక్కసారిగా షేక్ చేసింది. ముఖ్యంగా ఆసియా దేశాలు ఈ భారీ ప్రకంపనలకు ప్రభావితం అయ్యాయి. 

మయన్మార్ లో వచ్చిన తీవ్ర భూకంపాలు పొరుగునే ఉన్న థాయ్ లాండ్ పై ప్రభావం చూపాయి. థాయ్ లాండ్ లోనూ ప్రకంపనలు రావడంతో ముందుగానే అలర్ట్ అయ్యింది అక్కడి ప్రభుత్వం. మయన్మార్ కు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ముందుగానే అలర్ట్ అయ్యింది ఆ దేశం. సిటీలో పెద్దఎత్తున డ్యామేజ్ జరగడంతో రాజధాని బ్యాంకాక్ లో ఎమర్జెన్సీ జోన్ గా ప్రకటించారు థాయ్ లాండ్ ప్రధాని. రానున్న 24 గంటల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పెద్ద బిల్డింగులకు దూరంగా ఉండాలని సూచించారు. 

ALSO READ | 12 నిమిషాల తేడాతో రెండు భూ కంపాలు : బ్యాంకాక్ లో మెట్రో రైలు ఎలా ఊగిపోయిందో చూడండీ..!

భూకంప తీవ్రతకు పెద్ద పెద్ద భవంతులు కూలిపోవడంతో.. ముందు జాగ్రత్తలు తీసుకుంది థాయ్ ప్రభుత్వం. ఎయిర్ పోర్ట్, మెట్రో, స్టాక్ ఎక్స్ చేంజీలను మూసివేశారు. అదే విధంగా సబ్ వేస్ ను కూడా మూసి వేసి ప్రజలు సురక్షితంగా ఉండాలని పిలుపునిచ్చింది ప్రభుత్వం. కరెంటు సరఫరాను కూడా కొన్ని ఏరియాల్లో నిలిపివేసింది ప్రభుత్వం. హై పవర్ ట్రాస్మిషన్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసింది. ఫ్యాక్టరీలు, కంపెనీలకు తాత్కాలికంగా సెలవు ప్రకటించారు.