లియో ఈవెంట్ క్యాన్సిల్.. పొలిటికల్ ప్రెజర్ లేదు.. షాకిచ్చిన మేకర్స్

తలపతి విజయ్(Thalapathi vijay) ఫ్యాన్స్ కు లియో(Leo) మూవీ మేకర్స్ బిగ్ షాకిచ్చారు. చాలా కాలంగా విజయ్ ఫ్యాన్స్ లియో సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే లియో ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా లియో ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ అంటూ ట్వీట్ చేశారు దీంతో విజయ్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.   

ఇంతేకీ అసలు విషయం ఏంటంటే.. తలపతి విజయ్, లోకేష్ కానగరాజ్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ లియో. మాస్టర్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ఈ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో లియో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే సినిమా నుండి  రిలీజైన పాటలు. పోస్టర్స్ సినిమాపై హైప్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి. ఈ క్రమంలోనే లియో సినిమాను అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంన్నారు. 

Also Read : డాన్స్ రారాజు : మైకల్ జాక్సన్ టోపీ రూ.68 లక్షలు..

ప్రమోషన్స్ లో భాగంగా సెప్టెంబర్ 30న ఆడియో లాంచ్ ప్లాన్ చేశారు మేకర్స్. ఇందుకోసం ఏర్పాటు చేసిన టికెట్స్, పాసులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో చేసేదేమీ లేక ఆడియో లాంచ్  క్యాన్సిల్ చేస్తున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటిస్తూ.. ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు... ఆడియో లాంచ్ కి భారీ డిమాండ్ ఏర్పడింది, ఊహించని స్థాయిలో ఫ్యాన్స్ వస్తే వారిని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. ఏదైనా జరిగితే అందరు బాధపడాల్సి వస్తుంది. కాబట్టి.. ఆడియో లాంచ్ ని క్యాన్సిల్ చేస్తున్నాం. అంతేగానీ ఇందులో ఎలాంటి పొలిటికల్ ప్రెజర్ లేదని కూడా మెన్షన్ చేశారు. కానీ.. ఇకనుండి వరుస అప్డేట్స్ తో ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తామని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.