కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay)కి టాలీవుడ్ లోనూ మంచి ఇమేజ్ ఉంది. అతని సినిమాలు థియేటర్స్ లోకి వస్తుందంటే ఫ్యాన్స్ ఎగబడిపోతారు.ప్రస్తుతం విజయ్ క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు (Venkatprabhu) డైరెక్షన్లో ద గోట్(The Greatest of All Time) అనే టైం ట్రావెల్ మూవీ చేస్తున్నాడు.ఈ మూవీలో ప్రియాంకా అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) విజయ్‌కి జోడీగా నటిస్తుంది.
లేటెస్ట్గా ఈ మూవీ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. అయితే, తమిళ సినిమా ఇండస్ట్రీలోనే ఎన్నడూ లేని రీతిలో ఈ మూవీ ఓటీటీ హక్కులు అమ్ముడుపోయినట్లు టాక్ వినిపిస్తోంది.కాగా ది గోట్ సినిమా ఏకంగా రూ.110 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్నట్లు కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి.దీంతో నెట్‌ఫ్లిక్స్ చేతికి మరో టాప్ హీరో మూవీ రావడం మాత్రం విశేషమే అని చెప్పుకోవాలి. సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలు భారీ బడ్జెట్ సినిమాలను నెట్‌ఫ్లిక్స్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.అలాగే ది గోట్ మూవీ శాటిలైట్ హక్కులను ఇప్పటికే జీ గ్రూప్ ఏకంగా రూ.90 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇలా దళపతి విజయ్68 ఫిల్మ్ శాటిలైట్,ఓటీటీ హక్కుల అమ్మకం చూస్తుంటే..రిలీజ్ కు ముందే భారీ స్థాయిలో బిజినెస్ చేస్తోంది.దీన్ని బట్టి ది గోట్ రిలీజ్ కి ముందుగానే రూ.200 కోట్లు రావడం విశేషం.ఇక థియేట్రికల్ హక్కులకు కూడా భారీ స్థాయిలో డిమాండ్ పలుకుతుంది.
విజయ్ ద గోట్ మూవీలో స్నేహ,ప్రభుదేవా,అజ్మల్,ప్రశాంత్ కీలక పాత్రలు పోషస్తున్నారు.ఇక ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఏ.జి.ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అర్చన కల్పతి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.ఈ మూవీ 2024సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. డైరెక్టర్ వెంకట్ ప్రభు రీసెంట్గా నాగ చైతన్య తో కస్టడీ మూవీ తీసిన సంగతి తెలిసిందే.