The Greatest of All Time X Review: నేడే థియేటర్లోకి విజయ్ గోట్ మూవీ..టాక్ ఎలా ఉందంటే?

The Greatest of All Time X Review: నేడే థియేటర్లోకి విజయ్ గోట్ మూవీ..టాక్ ఎలా ఉందంటే?

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) నటిస్తున్న మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (The GOAT). మీనాక్షి చౌదరి హీరోయిన్. వెంకట్ ప్రభు దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు, టీజర్ విజువల్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ వినాయక చవితి సందర్బంగా గురువారం (సెప్టెంబర్ 5న) వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ప్రీమియర్స్, రిలీజ్ ఫస్ట్ షో చూసిన ఆడియన్స్ మౌత్ టాక్ సోషల్ మీడియాలో ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది టైమ్ సినిమా చూశాను. ఓపెనింగ్ బ్లాక్ బాగుంది. ఈ సినిమాకు సస్పెన్స్ ప్రధానమైన పాజిటివ్ అంశంగా మాిరంది. విజయ్ వేసిన స్టెప్పులకు విజిల్స్ వేయాల్సిందే. ఇప్పటి వరకు విజయ్‌లో చూడని చార్మింగ్, ఫన్ సైడ్ ఈ సినిమాలో చేసే అవకాశం ఉంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యే అంశాలు చాలా ఉన్నాయి. ఇంకా ఇంటర్వెల్ బ్లాక్. ఫస్టాఫ్ చాలా సూపర్‌గా ఉంది అని ఆడియెన్ ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

దళపతి, ఇళయ దళపతి ఫైటింగ్ సీన్ ఉంటుందట.. సినిమా మొదటి పది నిమిషాలు అస్సలు మిస్ అవ్వకండి అంటూ చెబుతున్నారు. సినిమాని ఒక్క వర్డ్‌లో చెప్పాలంటే.. స్టన్నింగ్‌గా ఉందని అంటున్నారు. విజయ్ ఫ్యాన్స్ మాత్రం గోట్‌ను బాగానే సెలెబ్రేట్ చేసుకుంటున్నారని అర్థం అవుతోంది. విజయ్ ఎంట్రీకి అరుపులతో థియేటర్లు బద్దలు అవుతున్నాయని ట్విట్టర్‌లో ఆ వీడియోలని చూస్తేనే తెలుస్తోంది.

విజయ్ కెరీర్‌లో ఇప్పటి వరకు చూడని సినిమా ఇది. ఫస్టాఫ్ చాలా వేగంగా సాగిపోతుంది. ఊహించని హీరో ఇంట్రడక్షన్ ఉంది. విజిల్స్ వేసే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఫ్యాన్స్‌కు పండగలాంటి మూవీ. ఎవరూ ఊహించని ట్విస్టులు, టర్న్‌లు ఉన్నాయి. ఈ సినిమా ఓ రోలర్ కోస్ట్ రైడ్. హాలీవుడ్ స్థాయిలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది. విజయ్ ఫెర్ఫార్మెన్స్, దళపతి సన్నివేశాలు, యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఓవరాల్‌గా థియేటర్‌లో బ్లాస్ అయ్యే సినిమా అని నెటిజన్ కామెంట్ చేశారు. ఇంటర్వెల్ తరువాత వచ్చే సీన్ అదిరిపోయిందని.. లయన్ ఈజ్ ఆల్వేస్ లయన్.. ది వెయిటింగ్ అనే సీన్లు ఫ్యాన్స్‌కి కిక్కిస్తాయని అంటున్నారు.

ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌‌. స్నేహా, లైలా,  జయరాయ్, ప్రశాంత్, ప్రభుదేవా, యోగిబాబు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అర్చన కల్పతి నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. విజయ్‌‌కి ఇది 68వ చిత్రం. ఇటీవల విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఇదే తన ఆఖరి చిత్రంగా  ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా సుమారు రూ. 300 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కించారు. ఎలాంటి హిట్ అందుకోనుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచిచూడాల్సిందే.