JanaNayagan: అఫీషియల్.. దళపతి విజయ్ చివరి సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది

JanaNayagan: అఫీషియల్.. దళపతి విజయ్ చివరి సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది

దళపతి విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. నేడు (మార్చి 24న) జన నాయగన్ కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. పొంగల్ (09.01.2026) సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ సినిమా మొదట అక్టోబర్, 2025లో విడుదల కావాల్సి ఉంది.  కానీ, సినిమా షూటింగ్ కి గ్యాప్ రావడంతో మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

జన నాయగన్ కొత్త పోస్టర్ అభిమానులని ఆకట్టుకుంటోంది. ఇందులో విజయ్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తమిళనాడు ఎన్నికల ఓటింగ్ ముందు వస్తోన్న జన నాయగన్ పై భారీ అంచనాలున్నాయి. 'జన నాయగన్' సినిమాతో విజయ్ బలమైన సందేశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో.. సామజిక కథ, కథనాలతో రూపొందుతుంది.

ఈ సినిమాలో విజయ్కి జోడీగా స్టార్ హీరోయిన్ పూజాహెగ్దే నటిస్తుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి, మమిత బైజు, మోనిషా బ్లెస్సీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

ALSO READ | కన్నప్ప సినిమాపై ట్రోల్ చేస్తే శివుడి ఆగ్రహానికి, శాపానికి గురవుతారు: నటుడు రఘుబాబు