తలపతి విజయ్ గోట్ మూవీలో సహనటిగా నటించిన పార్వతి నాయర్ (Parvati Nair)పై కేసు నమోదైంది. సుభాష్ చంద్రబోస్ అనే కార్మికుడిపై దాడి చేసి నిర్బంధించారనే ఆరోపణల నేపథ్యంలో పార్వతి నాయర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు.
బోస్...తేనాంపేట పోలీస్ స్టేషన్‌లో పార్వతి నాయర్‌పై ఫిర్యాదు చేశాడు. అయినా అక్కడ పార్వతి నాయర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సైదాపేట 19వ ఎంఎం కోర్టును ఆశ్రయించారు సుభాష్ చంద్రబోస్.
DSR కాపీ ప్రకారం.. వివరాల్లోకి వెళితే..KJR స్టూడియోస్‌లో హెల్పర్‌గా పనిచేసిన సుభాష్ చంద్ర బోస్‌ను.. 2022లో పార్వతి నాయర్ నివాసంలో ఇంటి పని చేయమని అడిగారట.
ఆ సమయంలో, పార్వతి నాయర్ ఇంటి నుండి ల్యాప్‌టాప్, వాచ్, కెమెరా మరియు మొబైల్ ఫోన్‌తో సహా అనేక వస్తువులు కనిపించకుండా పోవడంతో..ఆ తర్వాత నాయర్ అనుమానాస్పద దొంగతనం ఆరోపణలపై బోస్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో బోస్ ను పోలీసులు విచారించినట్టు సమాచారం.
ఇక బోస్ తన విడుదల తర్వాత..KJR స్టూడియోస్‌లో తిరిగి పని చేయడానికి వచ్చినప్పుడు.. పార్వతి నాయర్ స్టూడియోకి వచ్చి తనను చెంపదెబ్బ కొట్టారని, మిగిలిన ఐదుగురు తనను అసభ్యంగా తిట్టారని..దాడి చేసి నిర్బంధించారని బోస్ ఆరోపించారు.
Also Read :- గిన్నిస్ రికార్డుకు చిరంజీవికి ప్రత్యేక అనుబంధం
ఈ క్రమంలో బోస్ తేనాంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సైదాపేట 19వ ఎంఎం కోర్టును ఆశ్రయించారు బోస్. సైదాపేట మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు పార్వతి నాయర్‌తో పాటు మరో ఐదుగురిపై సెక్షన్ 296(బి), 115(2), 351(2) బిఎన్‌ఎస్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసు విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.