GOAT Box Office Collection Day 1: వంద కోట్లు అనుకుంటే వచ్చింది స‌గమే..ది గోట్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే?

స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) లేటెస్ట్ మూవీ ది గోట్ (THE GOAT). ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రాగా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఎక్కడ చూసిన విజయ్ ఫ్యాన్స్ హంగామా నడుస్తోంది.భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీ ఇండియావైడ్‌గా ఫస్ట్ డే రూ.43 కోట్లు నికర వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.

ఈ మేరకు ది గోట్ తమిళంలో రూ. 38.3 కోట్లు, హిందీలో రూ.1.7 కోట్లు, తెలుగులోరూ.3 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. 76.23 శాతం థియేటర్ ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఈ మూవీకి తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ 21 కోట్ల జరిగినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.ఏదేమైనప్పటికీ..తెలుగు స్టేట్స్ లో రూ.22 కోట్ల షేర్ ని అందుకుంటేనే GOAT మూవీ క్లీన్ హిట్గా నిలుస్తుంది.

Also Read:-ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కామెడీ డ్రామా మూవీ

ఇకపోతే  రూ.100 కోట్లు (గ్రాస్) కలెక్షన్స్ రాబ‌డుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాల‌తో పాటు మేక‌ర్స్ అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ వాటిని పూర్తిగా త‌ల‌క్రిందులు చేస్తూ తొలిరోజు ఈ మూవీ ఇండియావైడ్‌గా రూ.55 కోట్ల లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. కాగా విజ‌య్ గ‌త మూవీ లియో తొలిరోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా 63 కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. దీంతో  లియో మూవీ రికార్డును ది గోట్ దాట‌లేక‌పోయింది. 

ద‌ళ‌ప‌తి విజ‌య్ డ‌బ్బింగ్ మూవీస్‌లో అతి త‌క్కువ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా ది గోట్ నిలిచింది. సినిమాపై ఉన్న నెగెటివ్ కార‌ణంగా శుక్ర‌వారం రోజు క‌లెక్ష‌న్స్ మ‌రింత త‌గ్గుముఖం ప‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

టైం ట్రావెల్,స్సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలో ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా విజ‌య్ డ్యూయ‌ల్ రోల్‌లో న‌టించాడు. మీనాక్షి చౌద‌రి, స్నేహా హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాలో త్రిష ఐటెంసాంగ్ చేసింది. ఈ సినిమాని తెలుగులో ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ వింగ్ 'మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌ఎల్‌పి' (Mythri Distributors LLP) రిలీజ్ చేసింది.