విజయ్ చివరి సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్

విజయ్ చివరి సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్

గతేడాది సిల్వర్ స్క్రీన్ కు దూరమైన శ్రుతి హాసన్.. ఈ ఏడాది మాత్రం వరుస క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. దాదాపు నాలుగు సినిమాల్లో హీరోయిన్‌‌గా నటిస్తోంది శ్రుతి. 

తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా నటిస్తున్న ఆఖరి చిత్రంలో శ్రుతి హాసన్‌‌ కూడా చోటు దక్కించుకుందని తెలుస్తోంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో ‘జన నాయగన్’ టైటిల్‌‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తుండగా, మరో హీరోయిన్‌‌గా శ్రుతి హాసన్‌‌ను ఎంపిక చేశారట మేకర్స్. 

త్వరలోనే  ఆమె సెట్స్‌‌లో జాయిన్ కానుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో  ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, మమితా బైజు, బాబీ డియోల్, ప్రియమణి  ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  కెవీఎన్ సంస్థ నిర్మిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ‘పులి’ తర్వాత విజయ్,  శ్రుతి హాసన్ కలిసి దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత నటిస్తున్న  చిత్రమిది. అలాగే విజయ్‌‌కు లాస్ట్ మూవీ కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.