Thalapathy Vijay Son: డైరెక్టర్గా జాసన్ సంజయ్ ఎంట్రీ..లోకేష్ బాటలోనే దళపతి విజయ్ కొడుకు

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay)  ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఈ రేంజ్ లో ఉంటుందో అందరికి తెలిసిందే. టాలీవుడ్,కోలీవుడ్ లో అతని మూవీస్ కి స్పెషల్ ట్రెండ్ ని క్రియేట్ చేసుకున్నారు. ఇక తన ట్రెండ్ ని మరింత పెంచేందుకు తన వారసుడు వచ్చేస్తున్నాడు. దళపతి హీరో విజయ్ కుమారుడు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. 

తాజా సమాచారం ప్రకారం..విజయ్ లాంటి టాప్ హీరో కొడుకు జాసన్ సంజయ్ (Jason Sanjay) హీరోగా కాకుండా..డైరెక్టర్గా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. డెబ్యూ డైరెక్టర్గా ఒక మంచి కంటెంట్ స్టోరీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందుకోసం జాసన్ సంజయ్ ఫస్ట్ మూవీని కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది. 

తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో బైలింగ్వ‌ల్ మూవీగా తెర‌కెక్క‌నున్న ఈ ప్రాజెక్ట్ లో తెలుగు వర్సటైల్ యాక్టర్ సందీప్‌కిష‌న్ హీరోగా న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా జాస‌న్ సంజ‌య్ ఈ సినిమా క‌థ‌ను రాసుకున్న‌ట్లు తెలుస్తోంది. జాస‌న్ సంజ‌య్ ఫ‌స్ట్ మూవీకి లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ త‌మ‌న్ మ్యూజిక్ అందించ‌బోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే జాస‌న్ విజ‌య్ డైరెక్ష‌న‌ల్ డెబ్యూ మూవీకి సంబంధించి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు స‌మాచారం. 

ప్రస్తుతం సంజయ్ జాసన్ క్రియేటివ్ టీంతో పాటు, నటి నటులను సెలెక్ట్ చేసే వర్క్లో ఉన్నట్లు టాక్. తొలుత ఈ సినిమాలో చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ విక్ర‌మ్ హీరోగా న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. అనివార్య కార‌ణాల వ‌ల్ల ధృవ్ విక్ర‌మ్ ఈ మూవీ నుంచి త‌ప్పుకున్న‌ట్లు తెలిసింది. ధృవ్ విక్ర‌మ్ స్థానంలో సందీప్‌కిష‌న్ ఈ మూవీలోకి ఎంట్రీ ఇచ్చిన‌ట్లు టాక్.దీంతో టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలు షాక్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా..'దళపతి విజయ్ కొడుకు అంటే.. మినిమమ్ పవర్ ఉంటుందని మరికొందరు సోషల్ మీడియాలో విషెస్ తెలుపుతున్నారు. 

అయితే మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే..డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన ఫస్ట్ మూవీని హీరో సందీప్ కిషన్ 'మా నగరం'తో వచ్చి..ఆ తర్వాత తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఇండియా బిగ్గెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరుగా నిలిచారు లోకేష్. ఇక ఆ బాటలోనే విజయ్ కొడుకు జాసన్ వస్తుండటంతో అంచనాలు పెరుగుతున్నాయి. 

జాసన్ సంజయ్ టొరంటో ఫిల్మ్ స్కూల్ (2018-2020)లో ఫిల్మ్ ప్రొడక్షన్ డిప్లొమా కంప్లీట్ చేసి అటు నుంచి(2020-2022) సం.లో లండన్‌ కెనడాలో స్క్రీన్ రైటింగ్‌లో ఫిల్మ్ మేకింగ్ కోర్సును నేర్చుకున్నాడని సమాచారం.