స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) లేటెస్ట్ మూవీ ది గోట్ (THE GOAT). ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలోకి వచ్చింది. పలుచోట్ల నెగిటివ్ రివ్యూస్ వచ్చిన కలెక్షన్స్ తగ్గేదేలే అనేలా బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తోంది.
ది గోట్ మూవీ..నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.280 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్ లోను కలెక్షన్స్ అదరగొడుతుంది. ఇప్పటివరకు $14.26M ( 120కోట్లు) కొల్లగొట్టింది. ఇక ఈ సెకండ్ వీక్ లో మరిన్ని కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. కానీ, తెలుగులో మాత్రం జోరు తగ్గించింది.తెలుగు డిస్ట్రీబ్యూటర్లకు నష్టాలూ తెచ్చేలా ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం. వివరాల్లోకి వెళితే..
Also Read:-మానవత్వం చాటుకొన్న హీరో శింబు
అయితే ఈ సినిమాని తెలుగులో ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ వింగ్ 'మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌ఎల్‌పి' (Mythri Distributors LLP) భారీ స్థాయిలో రిలీజ్ చేసింది.కానీ, ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ విషయంలో భారీ డిజాస్టర్ దిశగా సాగుతోంది.మైత్రీ మూవీస్ రూ.22 కోట్లకు గోట్ మూవీ థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేయగా..మొదటి 4రోజులకు గాను రూ.10.10 కోట్లు రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. ఇంకా తెలుగులో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే చాలా బిగ్ జంప్ రావాలి. ఇక రానున్న రోజుల్లో ఎంతమేరకు అది సాధ్యం అయ్యే పనే కాదని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఏమవుతుందో చూడాలి.
మరోవైపు కేరళలో ఈ చిత్రం భారీ డిజాస్టర్ దిశగా సాగుతోంది. మొదట రోజు రూ. 5. 80 కోట్లు మాత్రమే రాబట్టింది. 4 రోజులకు గాను రూ. 10.40 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గోకులం మూవీస్ కు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. అంతేకాకుండా పలుచోట్ల ఎగ్జిబిటర్లు నిండా మునిగినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
Just another weekend at the box office
— Archana Kalpathi (@archanakalpathi) September 9, 2024
A total #ThalapathyTakeover 🔥🔥 @actorvijay Sir @Ags_production @vp_offl @aishkalpathi #TheGreatestOfAllTime #GOAT pic.twitter.com/Ah3659SmOo
విజయ్ ది GOAT మూవీకి పోటీగా తెలుగు నుంచి మంచి కంటెంట్ సినిమా వచ్చింది.రానా సమర్పణలో నివేదా థామస్ నటించిన 35 చిన్న కథ కాదు. ఈ మూవీ కథ, కథనానికి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ రెండు మూవీస్ మధ్య తెలుగులో పోటీ నెలకొంది. టైం ట్రావెల్,స్సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలో ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా విజయ్ డ్యూయల్ రోల్‌లో నటించాడు. మీనాక్షి చౌదరి, స్నేహా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో త్రిష ఐటెంసాంగ్ చేసింది.