
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay)కి టాలీవుడ్ లోనూ మంచి ఇమేజ్ ఉంది. అతని సినిమాలు థియేటర్స్ లోకి వస్తుందంటే ఫ్యాన్స్ ఎగబడిపోతారు. ప్రస్తుతం విజయ్ క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు (Venkatprabhu) డైరెక్షన్‌లో ద గోట్(The Greatest of All Time) అనే టైం ట్రావెల్ మూవీ చేస్తున్నాడు. విజయ్ 68 వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీలో ప్రియాంకా అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) విజయ్కి జోడీగా నటిస్తుంది.
లేటెస్ట్గా ఈ మూవీ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తమిళ సినిమా ఇండస్ట్రీలోనే ఎన్నడూ లేని రీతిలో ఈ మూవీ ఓటీటీ హక్కులు అమ్ముడుపోయినట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఏ రేంజ్ లో ఓటీటీ బిజినెస్ జరిగిందనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. కాగా విజయ్ రీసెంట్ ఫిలిం లియో సినిమాకు రూ.120 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ హక్కులు సొంతం చేసుకుంది.
ALSO READ :- తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: నితిన్ గడ్కరీ
దీన్నీ బట్టి చూసుకుంటే..ఇంతకంటే భారీ మొత్తంలోనే ద గోట్ మూవీ డిజిటల్ హక్కులు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. అయితే నెట్‌ఫ్లిక్స్ చేతికి మరో టాప్ మూవీ రావడం మాత్రం విశేషమే. సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలు భారీ బడ్జెట్ సినిమాలను నెట్‌ఫ్లిక్స్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
#Netflix snaps #ThalapathyVijay’s #TheGreastestOfAllTime directed by @vp_offl and produced by @Ags_production #NetflixNext #NetflixSlate2024 @NetflixIndia @Netflix_INSouth pic.twitter.com/ycwXvADzgz
— Sreedhar Pillai (@sri50) February 29, 2024
విజయ్ ద గోట్ మూవీలో స్నేహ, ప్రభుదేవా, అజ్మల్, ప్రశాంత్ కీలక పాత్రలు పోషస్తున్నారు. ఇక ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఏ.జి.ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అర్చన కల్పతి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ మూవీ 2024 జులై 31న థియేటర్లలో రిలీజ్ కానుంది. డైరెక్టర్ వెంకట్ ప్రభు రీసెంట్గా నాగ చైతన్య తో కస్టడీ మూవీ తీసిన సంగతి తెలిసిందే.