ఉప్పల్‎లో తమన్‌‌‌‌‌‌‌‌ షో అదుర్స్‌‌‌‌‌‌‌‌.. హోరెత్తిన స్టేడియం

ఉప్పల్‎లో తమన్‌‌‌‌‌‌‌‌ షో అదుర్స్‌‌‌‌‌‌‌‌.. హోరెత్తిన స్టేడియం

ఐపీఎల్‌‌‌‌కు ఆతిథ్యం ఇస్తున్న వేదికల్లో ఆరంభ వేడుకల్లో భాగంగా గురువారం (మార్చి 28) సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జైయింట్స్ మ్యాచ్‌‌‌‌కు ముందు మ్యూజిక్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ తమన్ పెర్ఫామెన్స్‌‌‌‌ చేశాడు. తాను మ్యూజిక్ ఇచ్చిన పలు సినిమా పాటలతో అభిమానులను అలరించాడు. దాదాపు 20 నిమిషాల పాటు జరిగిన ఈ ఈవెంట్‌‌‌‌లో మొదట గ్రౌండ్‌‌‌‌లో వేసిన స్టేజ్‌‌‌‌పై పెర్ఫామెన్స్ చేసిన తమన్ తర్వాత స్పెషల్ కార్ట్ కారులో గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ ఫ్యాన్స్‌‌‌‌లో జోష్ నింపాడు.

అప్పటికే స్టేడియం నిండిపోగా.. తమన్‌‌‌‌ పాటలకు అభిమానులూ కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా స్టేడియంలో ఎల్‌‌‌‌ఈడీ లైటింగ్ షో కూడా ఆకట్టుకుంది. ఇన్నింగ్స్‌‌‌‌ మధ్యలో ఫ్లడ్‌‌‌‌ లైట్స్ ఆర్పేసి చీకట్లో లేజర్ లైటింగ్‌‌‌‌ షో, ఫైర్ వర్క్స్‌‎ను అభిమానులు ఎంజాయ్‌‌‌‌ చేశారు. ఈ మ్యాచ్‌‌‌‌కు 35,766 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.