TheRajaSaab: రాజాసాబ్పై ఎవరికీ హైప్ లేదు.. మాకు అదే కావాలంటున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్

TheRajaSaab: రాజాసాబ్పై ఎవరికీ హైప్ లేదు.. మాకు అదే కావాలంటున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్

డార్లింగ్ ప్రభాస్ తో క్లాసిక్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న 'ది రాజాసాబ్' సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. తాజాగా రాజాసాబ్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వివరాలను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పంచుకున్నారు. ఈ సినిమాలో పాటలు ఎలా ఉండనున్నాయో, ఆడియో లాంచ్ ఎక్కడ జరగనుందనే వంటి విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. 

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. " మన హీరోలే సినిమాలను వరల్డ్ వైడ్గా తీసుకెళ్తున్నారు.  ది రాజాసాబ్ జపాన్లో కూడా ఆడియో లాంచ్ జరుగుతోంది. అందుకు జపాన్ వెర్షన్లో పాటలు చేయమంటున్నారు. చాలా కాలం తర్వాత ప్రభాస్.. మాస్ పాటలతో వస్తున్నారు. ఒక హీరోయిన్‍తో డ్యుయెట్.. ఒక ఐటమ్ సాంగ్, లాస్ట్ ముగ్గురు హీరోయిన్లతో ఒక పాట. ఓపెనింగ్ ఇంట్రడక్షన్ సాంగ్. ఇంకా రాజాసాబ్ ప్రపంచానికి ఓ థీమ్. సినిమాపై ఎవరికీ ఎక్కువ హైప్ లేదు. మాకు అదే కావాలి. అంచనాలు ఎంత తక్కువ ఉంటే ఒక్క పాట రిలీజ్ అయ్యే సరికి అంత వావ్ అనిపిస్తుంది" అని తమన్ చెప్పారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

దాంతో ఈ లేటెస్ట్ అప్డేట్ చాలన్న.. 'ది రాజా సాబ్'లో ప్రభాస్ ఎలా ఉంటాడో చెప్పడానికి అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ మాస్ నంబర్‌ సాంగ్స్లో కనబడాలని చాలా కాలం నుండి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే 'ది రాజా సాబ్' మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీతో సహా పలు భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ మరియు బ్రహ్మానందం ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ 2025 ఏప్రిల్ 10 న రిలీజ్ కానుంది.