నటసింహ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)- సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil ravipudi) కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth kesari). ఎమోషనల్ అండ్ మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. దసరా కానుకగా అక్టోబర్ 19న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మంచి ఆదరణ లభిస్తోంది.
ఇక భగవంత్ కేసరి సినిమా భారీ విజయాన్ని సాధించడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. వరుస ఇంటర్వూస్ లో పాల్గొని తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా.. హీరో బాలకృష్ణ, దర్శకుడు అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు థమన్ లను మరో దర్శకుడు బాబి ఇంటర్వ్యూ చేశారు.
Also Read :- ఘనంగా వెంకటేష్ రెండో కూతురు నిశ్చితార్థం
ఈ సందర్భంగా తమన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.. సినిమాలో మంచి సీన్స్ పడితే మ్యూజిక్ తో బాగా ఎలివేట్ చేయడానికి ట్రై చేస్తాం. సీన్ లో ఎమోషన్ లేకపోతే ఎంత కొట్టినా అది వర్కవుట్ అవదు. నేనే కాదు.. ఎవరి వల్లా కాదు. చచ్చిన శవాన్ని తీసుకువచ్చి బతికించమంటే ఎలా పాజిబుల్? ఎవరిష్టానికి వాళ్ళు రివ్యూలు రాసేస్తారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాలేదు అంటారు.. అక్కడ మ్యాటర్ లేకపోతే నేను ఏం చేయాలి. అనిల్ మంచి సినిమా ఇచ్చాడు.. అందుకే భగవంత్ కేసరికి మ్యూజిక్ అలా కుదిరింది. అఖండ కూడా అలాగే వర్కవుట్ అయింది. అలా ఉండాలి సినిమాలు.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే.. తమన్ ఈ కామెంట్లు దర్శకుడు బోయపాటిని ఉద్దేశించే అన్నాడని, స్కంద మూవీ విషయంలో బోయపాటి చేసిన కామెంట్స్ కు కౌంటర్ గా తమన్ మాట్లాడాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి తమన్ నిజంగా బోయపాటిని ఉద్ధేశించే ఈ కామెంట్లు చేశాడా అనేది తెలియాల్సి ఉంది.