Odela 2: లేడీ అఘోరగా తమన్నా.. థ్రిల్లింగ్ చేస్తున్న ఓదెల 2 ఫస్ట్ లుక్

Odela 2: లేడీ అఘోరగా తమన్నా.. థ్రిల్లింగ్ చేస్తున్న ఓదెల 2 ఫస్ట్ లుక్

ఇన్నిరోజులు మిల్కీ బ్యూటీ అనిపించుకున్న తమన్నా(Thamannaah) సడన్ గా డివోషనల్ లుక్ లోకి మారిపోయారు. అఘోరాగా తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఓదెల 2(Odela 2). 20022లో వచ్చి డీసెంట్ హిట్ గా నిలిచిన ఓదెల రైల్వే స్టేషన్(Odela Railway Station) కు సీక్వెల్ గ్గా వస్తున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. దర్శకుడు అశోక్ తేజ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే కాశీలో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా నుండి తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. 

శివరాత్రి సందర్బంగా తమన్నా అఘోరా లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కాషాయ దుస్తుల్లో, చేతిలో ఢమరుకం,మెడలో రుద్రాక్ష మాలలతో, నుదుటన విభూదితో శివశక్తిగా తమన్నా లుక్ నెక్స్ట్ లెవల్లో ఉంది. చాలా పవర్ ఫుల్ గా ఉన్న ఈ లుక్ లో తమన్నా సరికొత్తగా కనిపిస్తున్నారు. ఈ లుక్ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. అంతేకాదు.. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాక.. సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇక మొదటి పార్ట్ రీజనల్ మూవీగా రాగా.. ఈ సీక్వెల్ పాన్ ఇండియా లెవల్లో రిలీస్ కానుంది. 

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ఇక ఈ సీక్వెల్ కు నిర్మాతగానే కాకండా కథను కూడా అందిస్తున్నారు సంపత్ నంది. మరి ఫస్ట్ లుక్ తోనే మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు ఆడియన్స్ ఎలాంటి రిజల్ట్ ఇస్తారో చూడాలి.