Jee Karda Review : బోల్డ్ సీన్స్తో రెచ్చిపోయిన తమన్నా

Jee Karda Review : బోల్డ్ సీన్స్తో రెచ్చిపోయిన తమన్నా

"జీ కర్దా".. మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ జూన్ 15న అమెజాన్ ప్రైమ్లో రిలీజయింది. ట్రైలర్ లో చూపించిన బోల్డ్ కాంటెంట్, హాట్ సీన్స్  ఈ సిరీస్ పై అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంది అనేది ఈ రివ్యూలో చూద్దాం. 

కథ: లావణ్య (తమన్నా), రిషభ్ (సుహైల్ నయ్యర్), షీతల్, అర్జున్, మెల్రాయ్, ప్రీత్,  షాహిద్ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. వీళ్ళు ఓకరోజు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే.. ఆయన ఒక‍్కొక్కరికి ఒక్కో విషయం చెబుతాడు. కానీ ఆవిషయాన్ని వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. కానీ పెద్దయ్యాక జ్యోతిష్యుడు చెప్పినట్టుగానే జరుగుతుంది. దీంతో వారి జీవితాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఇంతకీ అవేంటి? వాటివల్ల ఏం జరిగింది? అనేదే 'జీ కర్దా' మిగిలిన కథ. 

విశ్లేషణ: ఓటటీ ప్లేట్ ఫామ్ వచ్చాక డైరెక్టర్స్ కి ఫుల్ ఫ్రీడమ్ దొరికింది. బోల్డ్ సీన్స్, బూతులతో రెచ్చిపోతున్నారు మేకర్స్. హిందీలో వచ్చిన మీర్జాపుర్ నుండి తాజాగా తెలుగులో వచ్చిన సైతాన్ వరకు ఈ పంధాలో వచ్చినవే. ఇప్పుడు 'జీ కర్దా' కూడా ఓ రకంగా అలాంటి బోల్డ్ సిరీసే అని చెప్పొచ్చు. ఏడుగురు ఫ్రెండ్స్ జీవితాల్లో వాళ్లకు ఎదురైనా సంఘటనల ఆధారంగా వచ్చిందే ఈ సిరీస్. కోపం, ప్రేమ, సె*క్స్, అలక, కన్నీళ‍్లు.. ఇలా చాలా ఎమోషన్స్ ఉంటాయి.

ప్రస్తుతం సొసైటీలో పెరిగిపోతున్న అర్బన్ కల్చర్ లో ఏమేం జరుగుతుందనేది ఈ సిరీస్ లో చూపించారు. సిరీస్ లో ఒక్కో క్యారెక్టర్ కి ఒక్కో ఎమోషన్ ను సెట్ చేసిన విధానం. దాన్ని ప్రెసెంట్ చేసిన విధానం చాలా ఉంది. అది ఆడియన్స్ ను కచ్చితంగా ఆలోచింపజేస్తుంది. ఎవరి లైఫ్ అయినా సరే అనుకున్నట్లుగా అస్సలు ఉండదు. ఇదే ఈ సిరీస్ మెయిన్ స్టోరీ. కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినప్పటికీ.. ఎమోషన్స్ అండ్ డ్రామాను చాలా బాగా చూపించారు. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నఈ బోల్డ్ సిరీస్ ను ఒకసారి చూడొచ్చు

నటీనటులు: ఈ సిరీస్ లో మెయిన్ క్యారెక్టర్ తమన్నాదే. ఆమె చుట్టూనే కథ తిరుగుతుంది. అయితే.. తమన్నా హీరోయిన్ గా చేసిన సినిమాల్లో ఇప్పటివరకు ఆమె హద్దులు దాటలేదు. కానీ ఈ సిరీస్ లో బూతు డైలాగ్స్, బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయింది. ఇది ఆమె ఫ్యాన్స్ కు కాస్త ఇబ్బందిగా అనిప్పిస్తుంది. ఇక మిగిలిన రోల్స్ చేసిన వాళ్ళు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక టెక్నికల్ గా చూస్కుంటే.. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ట్ డిపార్ట్ మెంట్ తోపాటు నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.

ఫైనల్ గా చెప్పాలంటే "జీ కర్దా" యూత్ ను మెప్పిస్తుంది.