తండా డెవలప్​మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలి: గిరిజన శక్తి ప్రెసిడెంట్

తండా డెవలప్​మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలి: గిరిజన శక్తి ప్రెసిడెంట్

హైదరాబాద్, వెలుగు: కర్నాటక తరహాలో మన రాష్ట్రంలోనూ తండాల అభివృద్ధికి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని గిరిజన శక్తి ప్రెసిడెంట్ వెంకటేశ్ చౌహాన్ డిమాండ్ చేశారు. ఈ బోర్డుకు వచ్చే బడ్జెట్‌లో వెయ్యి కోట్ల ఫండ్స్ కేటాయించాలని గురువారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో ఆయన కోరారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 4 వేలకు పైగా తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయగా ఫండ్స్ కేటాయించకపోవటంతో అభివృద్ధికి దూరంగా  ఉన్నాయని తెలిపారు. బంజారా భాషను 8వ షెడ్యూల్ లో చేర్చేలా కేంద్రానికి రాష్ర్ట సర్కారు లేఖ రాయాలని కోరారు. అన్ని కాంపిటీటివ్ పరీక్షల్లో బంజారా భాష అమలు చేయాలని..తద్వారా బంజారాలు ఉద్యోగాలు పొందుతారని చెప్పారు. గిరిజన శక్తి రాష్ట్ర, జిల్లా,  మండల స్థాయి కమిటీలు రద్దు చేస్తున్నట్టుగా తెలిపారు. త్వరలో కొత్త  కమిటీలు ప్రకటిస్తామని వెంకటేశ్ చౌహాన్ ప్రకటించారు.