OTT New Movies: ఒకే ఓటీటీ ప్లాట్ఫామ్కి.. తండేల్, పట్టుదల సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT New Movies: ఒకే ఓటీటీ ప్లాట్ఫామ్కి.. తండేల్, పట్టుదల సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఈ వారం (ఫిబ్రవరి 5 to 6) తేదీలలో థియేటర్స్కి అదిరిపోయే సినిమాలు వచ్చాయి. టాలీవుడ్ నుంచి నాగ చైతన్య నటించిన తండేల్, తమిళ్ నుంచి అజిత్ పట్టుదల సినిమాలు థియేటర్స్ అలరిస్తున్నాయి. అయితే, ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్తో దూసుకెళ్తున్నాయి. మరి ఈ రెండు సినిమాలు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో రానున్నాయి? ఎప్పుడు రానున్నాయి? అనే వివరాలు చూద్దాం. 

తండేల్ ఓటీటీ:

తండేల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ సినిమాను ఏకంగా రూ.40 కోట్లకు నెట్‍ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు టాక్. నాగ చైతన్య కెరీర్లోనే ఇది హయ్యెస్ట్ డీల్. ఇకపోతే థియేట్రికల్ రన్ తర్వాత ఈ మూవీని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు తీసుకొస్తామని నెట్‍ఫ్లిక్స్ వెల్లడించింది. అన్నీ కుదిరితే మార్చిలో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. తండేల్ శాటిలైట్ రైట్స్ హక్కులను జీ తెలుగు టీవీ ఛానెల్ సొంతం చేసుకుంది.

తండేల్ కథ:

తండేల్ మూవీ శ్రీకాకుళం మత్స్యకారుడు రాజు జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఇందులో రాజు-సత్యల మధ్య ఉన్న ప్రేమకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. రాజు సముద్రంలోకి చేపల వేటకి వెళ్లడం, ఆ తర్వాత 22 మందితో కూడిన 3 బొట్లు పాకిస్థాన్ సరిహద్దుకు చేరడం, దాంతో అక్కడి పాకిస్థాన్ జైల్లో బంధించబడటం వంటి అంశాలు బాగా ఆసక్తిగా మారాయి. అక్కడి నుండి రాజు బయటపడి బుజ్జితల్లి ప్రేమను దక్కించున్నాడా లేదా అనేది ప్రధాన కథగా తండేల్ రూపొందింది.

పట్టుదల ఓటీటీ: 

స్టార్ హీరో అజిత్, హీరోయిన్ త్రిష జంటగా నటించిన పట్టుదల ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడులైంది. ఈ మూవీ ఫస్ట్ డే మంచి ఓపెనింగ్ రాబట్టింది. ఇండియాలో రూ. 22 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. మ‌‌గిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్తో నిర్మించింది.

ALSO READ | మోనాలిసానా మజాకా: రూ. 35 వేల కోసం వెళ్తే.. 35 లక్షల ఆఫర్ వచ్చింది

యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులు నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో భాషల్లో స్ట్రీమింగ్‍కు వస్తుందని ఇటీవలే నెట్‍ఫ్లిక్స్ వెల్లడించింది. మార్చి సెకండ్ వీక్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.

పట్టుదల క‌థ కోసం ద‌ర్శ‌కుడు మ‌గీజ్ తిరుమేని ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డ‌లేదు. ఓ భార్య మిస్సింగ్ వెన‌కున్న మిస్ట‌రీని ఛేదించే ఓ భ‌ర్త క‌థ ఇది. ఈ సింపుల్ పాయింట్ తీసుకుని తనదైన స్క్రీన్ ప్లేతో మ్యూజిక్ చేశాడు డైరెక్టర్.