తండేల్ టికెట్ బుకింగ్స్ ఓపెన్.. రూ.100 కోట్లు కొడుతుందా.?

తండేల్ టికెట్ బుకింగ్స్ ఓపెన్.. రూ.100 కోట్లు కొడుతుందా.?

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య, ప్రముఖ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. ఈ సినిమా ఫిబ్రవరి 7న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఫిషర్ మెన్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో తెలుగు డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించగా ప్రముఖ సినీ నిర్మాత బన్నీ వాసు నిర్మించాడు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్, పాటలు రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో తండేల్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. 

అయితే మేకర్స్ తండేల్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రిలీజ్ చేశారు. దీంతో బుక్ మై షో యాప్ లో ఫాస్ట్ గా టికెట్లు బుక్ అవుతున్నాయి. కాగా ఇప్పటివరకూ దాదాపుగా 20వేలకి పైగా టికెట్లు అమ్ముడయినట్లు బుక్ మై షో అధికారికంగా తెలిపింది. దీంతో అప్పుడే సినిమా కలెక్షన్స్ పై  అంచానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తండేల్ సినిమా మంచి లవ్ & ఎమోషనల్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో ఉండటంతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అలాగే రూ.100 కోట్లు పైగా కలెక్షన్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేగాకుండా మొదటిరోజు రూ.25 నుంచి రూ.30 కోట్లు ఓపెనింగ్స్ సాధిస్తుందని అంచనా. అయితే తెలుగులో ఫిబ్రవరి 7న పెద్ద బడ్జెట్ సినిమాలు రిలీజ్ కావడం లేదు. ఈ అంశం కూడా తండేల్ కి బాగానే కలసి వస్తోంది.

ALSO READ | జైలుకెళ్లోచ్చిన తర్వాత షూటింగ్ కి వచ్చిన జానీ.. అలా చేసేసరికి ఏడుస్తూ ఎమోషనల్..

ఈ విషయం ఇలా ఉండగా తండేల్ సినిమా గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలవల్ల షూటింగ్  అనుకున్న సమాయానికి పూర్తి కాలేదు. దీంతో రిలీజ్ డేట్ వాయిదా పడింది.