Thandel: బ్లాక్ బస్టర్ తండేల్.. నైజాంలో బ్రేక్ ఈవెన్.. నాలుగు రోజుల్లో క‌లెక్ష‌న్స్ ఎంతంటే?

Thandel: బ్లాక్ బస్టర్ తండేల్.. నైజాంలో బ్రేక్ ఈవెన్.. నాలుగు రోజుల్లో క‌లెక్ష‌న్స్ ఎంతంటే?

తండేల్ మూవీ బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ అందుకుంటోంది. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన తండేల్ మూవీ నాలుగు రోజుల్లో రూ.73.20 గ్రాస్ వసూళ్లు చేసింది. ఈ సందర్భంగా మేకర్స్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి వివరాలు వెల్లడించారు. 

"బ్లాక్ బస్టర్  తండేల్.. వాలెంటైన్స్ వీక్ లో బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తండేల్ 4 రోజుల్లో రూ.73.20 గ్రాస్ వసూళ్లతో భారీ వసూళ్లు సాధించిందని" మేకర్స్ వెల్లడించారు. సోమ‌వారం రోజు ఫిబ్రవరి 10న తండేల్ మూవీకి 10.83 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు.

అలాగే రూ.4.42 కోట్ల నెట్ సాధించిందని ట్రేడ్ వెబ్ సైట్ సాక్నిల్క్ పేర్కొంది. ఈ సినిమాకు మొత్తం నాలుగు రోజుల్లో రూ.41.22కోట్ల నెట్ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ వీకెండ్ లోగా వంద కోట్ల మైలురాయిని చేరే దిశగా జోరు కొనసాగిస్తోంది.

తండేల్ మూవీని గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ దాదాపు రూ.80 నుండి 90 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించింది. అందుకు తగ్గట్టుగానే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుపుకుంది. నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలోనే తండేల్ మూవీ రూ.60 కోట్ల మేరకు బిజినెస్ చేసింది. నైజాం ఏరియాలో ప‌దిన్న‌ర కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 

ఈ మూవీ ఇప్పటికే 80 శాతానికిపైగా రిక‌వ‌రీ వసూళ్లను సాధించింది. అంతేకాకుండా నైజాం ఏరియాలో బ్రేక్ ఈవెన్‌ను రీచ్ అయినట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. ఈ సినిమా నైజాం ఏరియాలో ప‌దిన్న‌ర కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నాలుగు రోజుల్లో ఒక్క నైజాం ఏరియాలోనే ఈ మూవీ ప‌ద‌కొండు కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. దీంతో నైజాంలో లాభాల వేట కొనసాగిస్తోంది.

తండేల్ పైరసీ:

అయితే, తండేల్ చిత్రం పైరసీ భూతానికి చిక్కింది. ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుండగానే, ఏపీ ఆర్టీసీ బస్సులో పైరసీ వెర్షన్ ప్లే అయినట్లు బయటికి రావడం పెద్ద సంచలనంగా మారింది. కోట్లు పెట్టి సినిమా నిర్మిస్తే.. ఇలా పైరసీ లీక్ కావడంపై తండేల్ చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ALSO READ | OTT Malayalam Movies: ఓటీటీకి వస్తున్న టాప్ 3 మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తండేల్ సినిమా పైరసీ లీక్ కావడంపై వీరు సోమవారం (ఫిబ్రవరి 10) మీడియాతో మాట్లాడారు. అభిమానులు, మీడియా సహకారంతో తండేల్ సినిమా పెద్ద హిట్ అయ్యింది.. కానీ పైరసీకి గురి కావడం బాధకరమని అల్లు అరవింద్ అన్నారు. మళ్లీ విజృంభిస్తోన్న పైరసీ భూతాన్ని నిర్మూలనకు కృషి చేయాలని ఫిల్మ్ ఛాంబర్‎లో కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు.

బన్నీ వాసు మాట్లాడుతూ.. పైరసీ లీక్ చేసే వారిపై క్రిమినల్ కేసు పెడతాం.. ఒక్కసారి క్రిమినల్ కేస్ ఫైల్ అయితే యువతకి చాలా ఇబ్బందని అన్నారు. క్రిమినల్ కేసు ఫైల్ అయితే వెనక్కి తీసుకోలేమని చెప్పారు.