ఫిబ్రవరిలో జనాలకు నచ్చే కంటెంట్‌‌‌‌‌‌‌‌తో..

ఫిబ్రవరిలో జనాలకు నచ్చే కంటెంట్‌‌‌‌‌‌‌‌తో..

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రం ‘తండేల్’.  అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న సినిమా విడుదల కానుంది. మంగళవారం ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా  హీరో నాగ చైతన్య మాట్లాడుతూ ‘రిలీజ్‌‌‌‌‌‌‌‌ డేట్‌‌‌‌‌‌‌‌ను ముందుగా అనుకొని దాన్ని బట్టి సినిమా పూర్తిచేసేవాడిని. కానీ ఈ సినిమా విషయంలో అరవింద్ గారు.. అవుట్‌‌‌‌‌‌‌‌పుట్ చూసి, తాను అనుకున్నట్టుగా వస్తేనే రిలీజ్ డేట్ చెప్తాను అన్నారు.  సినిమా అంటే ఇలానే తీయాలి. శ్రీకాకుళంలో కొందరు మత్స్యకారుల జీవితమే ఈ సినిమా. ఎప్పుడు రిలీజ్ చేసినా అది పండగే అవుతుంది.

నన్ను తెరపై నెక్స్ట్ లెవల్ లో చూపించాలని డైరెక్టర్ చందూ చాలా కష్టపడ్డారు. ఫిబ్రవరి 7న దుల్లకొట్టేద్దాం’ అన్నాడు.  సాయి పల్లవి మాట్లాడుతూ ‘మంచి కంటెంట్ ఎప్పుడు వచ్చినా అది జనాలకి నచ్చేస్తుంది. యాక్టర్స్‌‌‌‌‌‌‌‌తో పాటు టీమ్ అంతా ఎంతో ఎఫర్ట్ పెట్టి చేశాం. సినిమా అందరికీ నచ్చాలని కోరుకుంటున్నా’ అని చెప్పింది.  నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘రెండు రోజుల క్రితం సెకండ్ హాఫ్ చూసి, ఈ డేట్‌‌‌‌‌‌‌‌ను ఫైనల్ చేశాం. ఏ సినిమాకైనా బెస్ట్ రిలీజ్ డేట్,  ప్రమోషన్‌‌‌‌‌‌‌‌ లాంటివన్నీ  25 శాతమే పనిచేస్తాయి. 75 శాతం సినిమా బాగుంటేనే చూస్తారు. అలాంటి కంటెంట్ బాగున్న సినిమా ఇది’ అని చెప్పారు.

 ‘అరవింద్ గారు ఇచ్చిన రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌కు ది బెస్ట్ రెవెన్యూ, నెంబర్స్ చూడబోతున్నాం’ అని డైరెక్టర్ చందూ మొండేటి చెప్పాడు.  నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ ‘సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అక్కినేని అభిమానులంతా కాలర్ ఎగరేసేలా ఉంటుంది. ‘100 పర్సెంట్ లవ్‌‌‌‌‌‌‌‌’ చిత్రంతో చైతన్య గారు నాకు ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ట్యాగ్ ఇచ్చారు. దానికి బదులుగా ఇప్పుడు ‘తండేల్’ సినిమాను 100 కోట్ల క్లబ్ లో కూర్చోబెడతాం’ అని చెప్పారు.