![Thandel: తండేల్ మూవీ రియల్ హీరో జగన్ : సోషల్ మీడియాలో నెటిజన్ల వార్](https://static.v6velugu.com/uploads/2025/02/thandel-mother-emotional-about-ex-chief-minister-jagan-mohan-reddy_SerNXockuI.jpg)
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా వరల్డ్ వైడ్ పాన్ ఇండియా భాషల్లో శుక్రవారం రిలీజ్ అయ్యింది. ఈ సినిమా స్టోరీలోకి వెళితే అనుకోకుండా జాలర్లు సముద్రంలో గుజరాత్ తీరం దాటి పాకిస్తాన్ బార్డర్ లోకి వెళ్లి పోలీసులకి చిక్కిన తర్వాత నానా కష్టాలు పడి మళ్లీ ఇండియాకి వస్తారు. ఇది రియల్ లైఫ్ స్టోరీ కావడంతో ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయ్యారు. ఐతే శ్రీకాకుళంకి చెందిన జాలర్లు పాకిస్థాన్ నేవీ అధికారులకి దొరకడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఈ జాలర్లని ఇండియా తీసుకొచ్చారు.
దీంతో ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద వార్ నడుస్తోంది. అయితే శ్రీకాకుళం కి చెందిన మొగతమ్మ అనే ఓ మహిళ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 2019లో తన కుటుంబంలోని భర్త అప్పారావు, ఇద్దరు కొడుకులు కళ్యాణ్, కిషోర్ చేపల వేటకి వెళ్లి పాకిస్థాన్ లో చిక్కుకున్నారని దీంతో అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి చొరవ తీసుకుని తన ముగ్గురు కొడుకులని వెనక్కి తెచ్చారని చెప్పుకొచ్చింది. అంతేగాకుండా ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ముగ్గురికి రూ.15 లక్షలు పరిహారం కూడా అందించారని, రియల్ హీరో జగన్ అని ప్రసంశలు కురిపించింది.
ALSO READ | VD 12 నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. కింగ్ కోసం కిరీటం వెయిటింగ్..
జగన్ చేసిన ఈ సాయం వల్ల తన కొడుకుని రూ.10 లక్షలు వెచ్చించి షిప్ లో ఉద్యోగానికి కుదిర్చానని ఎమోషనల్ అయ్యింది. అయితే ఈ విషయాలు తండేల్ సినిమా రిలీజ్ కి ముందే చెప్పేవాళ్లమని కానీ, రాజకీయ అంశాలు సినిమాపై రుద్దకూడదని సినిమా యూనిట్ చెప్పటంతో రిలీజ్ అయిన తర్వాత చెబుతున్నామని పేర్కొంది. దీంతో తండేల్, అలాగే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. దీంతో కొందరు వైసీపీ ఫ్యాన్స్ మహిళని అభినందిస్తున్నారు. అలాగే చేసిన మేలు మర్చిపోకుండా మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా నిజాన్ని చెప్పినందుకు ప్రశంసిస్తున్నారు. గిట్టని వారు మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు.