![Allu Arjun: పాకిస్తాన్ జైల్లో అల్లు అర్జున్ ఫ్యాన్.. అతడి వల్లే తండేల్ సినిమా తీశారా.?](https://static.v6velugu.com/uploads/2025/02/thandel-movie-backstory-pakistan-constable-is-asking-allu-arjun-autograph_7HBRcjIwWz.jpg)
తెలుగు స్టార్ హీరో నాగ చైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమా శుక్రవారం రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. తండేల్ సినిమా రిలీజ్ రోజే రూ.21.27 కోట్లు కలెక్ట్ చేసి నాగ చైతన్య కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డులు క్రియేట్ చేసింది. అయితే శ్రీకాకుళానికి చెందిన మత్స్యకారుల లైఫ్ లో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాని తీశారనేది అందరికీ తెలిసిన విషయమే.. కానీ తండేల్ సినిమా వెనుక ఎవరికీ తెలియని మరో స్టోరీ మరోకటి ఉందట.
2019లో మత్స్యకారులు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లినప్పుడు అదే జైలులో పాకిస్థాన్ కి చెందిన అల్లు అర్జున్ ఫ్యాన్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడట.. అయితే ఈ మత్స్యకారులతో మాట్లాడుతూ తాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి వీరాభిమాని అని, జైలు నుంచి రిలీజ్ అయ్యి వెళ్లిన తర్వాత అల్లు అర్జున్ తో ఒక్క ఆటోగ్రాఫ్ తీసుకుని తనకి పంపించాలని అడ్రస్ కూడా ఇచ్చాడట.
అయితే మత్స్యకారులు రిలీజ్ అయ్యి ఇండియాకి వచ్చిన అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ కోసం తర్వాత కార్తీక్ అనే రైటర్ ద్వారా బన్నీ వాసుని సంప్రదించి తమ స్టోరీ చెప్పగా ఇంట్రెస్టింగ్ గా ఉందంటూ డైరెక్టర్ కి చెప్పి స్టోరీని డెవలప్ చేయించాడట. దీంతో తండేల్ సినిమా పాకిస్థాన్ జైల్లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ ఆటోగ్రాఫ్ అడగడం వల్లే తీశారని ప్రచారం జరుగుతోంది. ఏదేమైనప్పటికే ఈ విషయంతో అల్లు అర్జున్ కి ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారని ప్రూవ్ అయ్యింది.
ఈ విషయం ఇలా ఉండగా ఐకాన్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2: ది రూల్ గత ఏడాది చివరిలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపుగా రూ.2200 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది. అంతేకాదు బాలీవుడ్, టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలలో రికార్డులు క్రియేట్ చేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.