Thandel: తండేల్‌‌ థర్డ్ సింగిల్ రిలీజ్.. అదిరిపోయే లవ్ సింగ్ హైలెస్సో హైలెస్సా

Thandel: తండేల్‌‌ థర్డ్ సింగిల్ రిలీజ్.. అదిరిపోయే లవ్ సింగ్ హైలెస్సో హైలెస్సా

‘ఎంతెంత దూరాన్ని నువ్వు, నేను  మోస్తూ ఉన్న అసలింత అలుపే రాదు.. ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న కాస్త అయినా అడ్డే కాదు..’ అంటూ తమ ప్రేమను పాట ద్వారా చూపిస్తున్నారు  నాగచైతన్య, సాయిపల్లవి. వీరిద్దరూ జంటగా చందూ మొండేటి రూపొందిస్తున్న ‘తండేల్‌‌’ చిత్రంలోని పాట ఇది.

ఇప్పటికే విడుదలైన బుజ్జి తల్లి, నమో నమః శివాయ అంటూ సాగే రెండు పాటలు విడుదలవగా వాటికి  మంచి రెస్పాన్స్ వచ్చింది.  తాజాగా  ‘హైలెస్సో హైలెస్సా’ అంటూ సాగే మూడో  పాటను విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ మెలోడీకి శ్రీమణి క్యాచీ లిరిక్స్ రాయగా, నకాష్ ఆజీజ్, శ్రేయా ఘోషల్ పాడిన తీరు ఆకట్టుకుంది.

‘నీతో ఉంటే తెలియదు సమయం.. నువ్ లేకుంటే ఎంత అన్యాయం.. గడియారంలో సెకనుల ముల్లే గంటకు కదిలిందే.. నీతో ఉంటే కరిగే కాలం.. నువ్ లేకుంటే కదలను అంటే.. నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే.. హైలెస్సో..హైలెస్సో’ అంటూ సాగిన పాటలో నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ ఇంప్రెస్ చేస్తుంది. చైతూ రగ్గడ్  లుక్‌‌లో కనిపిస్తుండగా,  సాయి పల్లవి  తనదైన   క్లాసిక్ డ్యాన్స్ మూమెంట్స్‌‌తో మెస్మరైజ్ చేసింది.  అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.