రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన తండేల్.... నాగ చైతన్య కెరీర్ లో ఇదే టాప్..

రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన తండేల్.... నాగ చైతన్య కెరీర్ లో ఇదే టాప్..

టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య, మలయాళ బ్యూటీఫుల్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చితరం "తండేల్." ఈ సినిమా ఈ నెల 7న రిలీజ్ అయింది. రియల్ లైఫ్ స్టోరీ.. మంచి క్లాసిక్ మెలోడీ సాంగ్స్, నాగ చైతన్య, సాయి పల్లవి యాక్టింగ్ ఇలా అన్నీ అద్భుతంగా ఉండటంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో దూసుకుపోతోంది. స్టోరీ నేరేషన్, మేకింగ్ చక్కగా వర్కౌట్ అవడంతో తండేల్ చిత్ర యూనిట్ రిలీజ్ ముందు నుంచే మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 

అయితే తండేల్ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. దర్శక నిర్మాతలు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఐతే ఈ సినిమా రిలీజ్ అయ్యి 9 రోజులు కావస్తునప్పటికీ కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గడం లేదు.. దీనికితోడు ఈ వారం రిలీజ్ అయిన లైలా, బ్రహ్మ ఆనందం సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో తండేల్ సినిమాకి థియేటర్లు, షోలు ఎక్కువగా ఉండటంతో ఈ వారం మరింత ఎక్కువగా కలెక్షన్స్ సాధించే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు.

ఈ విషయం ఇలా ఉండగా తండేల్ కథ విషయానికొస్తే... 2018లో శ్రీకాకుళానికి చెందిన మత్య్సకారులు గుజరాత్‍లో చేపల వేటకు దిగి అనుకోకుండా సముద్రంలో పాకిస్థాన్ హద్దులకు వెళ్లారు. అక్కడ పాక్ సైన్యానికి పట్టుబడ్డారు. పాక్ జైలులో కొన్ని నెలల పాటు చిత్ర హింసలు అనుభవించారు. ఆ తర్వాత మళ్లీ భారత్‍కు చేరారు. వారిలో మత్స్యకారుడు రాజు కూడా ఒకరు. అతడి నిజ జీవిత కథ ఆధారంగానే తండేల్ చిత్రం రూపొందింది.