Thandel: ప్రేమ, దేశభక్తి కలయికే తండేల్.. ఇంటెన్స్ ఎమోషన్ లుక్లో నాగ చైతన్య

Thandel: ప్రేమ, దేశభక్తి కలయికే తండేల్.. ఇంటెన్స్ ఎమోషన్ లుక్లో నాగ చైతన్య

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా టాలెంటెడ్ దర్శకుడు చందు మొండేటి (Chandu mondeti) కాంబోలో తెరకెక్కుతున్న మూవీ తండేల్(Thandel). నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్గా నటిస్తోంది.

ఇవాళ జనవరి 26 రిపబ్లిక్ డే స్పెషల్గా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. "భారత్ మాతా కీ జై.. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు" అంటూ తండేల్ చిత్ర బృందం శుభాకాంక్షలు తెలిపింది. 

ఈ కొత్త పోస్టర్లో నాగ చైతన్య పవర్ ఫుల్ లుక్లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఉండే ఇంటెన్స్ ఎమోషన్తో చై లుక్ ఆకట్టుకుంటోంది. ప్రేమ, దేశభక్తి, జాలరుల జీవితాల నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది. కథ వివరాల్లోకి వెళితే.. 

గుజరాత్‌ లోని సూరత్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. బోటు నడిపే వ్యక్తి బతుకుదెరువు కోసం గుజరాత్‌లోని వీరవల్‌కు వెళ్లగా..అలా సముద్రవేట లో ఉంటూ పాకిస్థాన్‌ కోస్టుగార్డుల చెరలో చిక్కుతాడు. అలా అక్కడి పాకిస్థాన్ జైలు నుంచి..అత‌డు ఎలా బయటపడ్డాడు? అతన్ని ప్రేమించిన అమ్మాయిని చివరకు కలుసుకున్నాడా? పాకిస్థాన్ చెరలో బందీగా ఉన్న భారతీయులను ఎలా బయటికి తీసుకొచ్చాడు అనే అంశాలతో సినిమా రానున్నట్లు టాక్. ఇటీవలే రరిలీజ్ చేసిన గ్లింప్స్‌ గమనిస్తే..  

ఏంట్రా దేశభక్తి ఆ? మా నుంచే ఊడిపోయిన ఒక ముక్క..మీకే అంత ఉంటే ..ఆ ముక్కను ముష్టేసిన మాకు ఎంత ఉండాలిరా? అని నాగ చైతన్య చెప్పే డైలాగ్ అదిరిపోయింది. గ్లింప్స్‌ చివర్లో..బుజ్జిత‌ల్లి వ‌చ్చేస్తున్న కదే.. కాస్తా న‌వ్వ‌వే అంటూ చైతూ వాయిస్ తో సముద్రపు అడుగుల అలజడితో సాయి ప‌ల్ల‌వి క‌నిపించ‌డం గ్లింప్స్‌కే హైలెట్‌గా నిలిచింది. ప్రేమ కథ, దేశభక్తి అంశాలతో తెరకెక్కుతున్న తండేల్ చై ఫ్యాన్స్ కు సూపర్ ఎసెన్స్ గ్లింప్స్‌ ఇచ్చేసింది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.