Thandel OTT Update: ఓటిటిలోకి వచ్చేస్తున్న తండేల్.. ఎక్కడ చూడాలంటే.?

Thandel OTT Update: ఓటిటిలోకి వచ్చేస్తున్న తండేల్.. ఎక్కడ చూడాలంటే.?

టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం "తండేల్". ఈ సినిమాని ప్రముఖ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించగా అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 7న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అయ్యింది. పాకిస్థాన్ కి చిక్కిన శ్రీకాకుళం కి చెందిన మత్స్యకారుల రియల్ లైఫ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.120 కోట్లు పైగా కలెక్ట్ చేసింది. ముఖ్యంగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ మంచి మ్యాజిక్ చేసింది. 

తండేల్ సినిమా ఓటిటి ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కోసం మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. అయితే ఈ సినిమా ఓటిటి రైట్స్ ని ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. దీంతో ఈ సినిమా మార్చ్ 7న (శుక్రవారం) నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవితున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అంతేకాదు ఈ విషయానికి సంబందించిన పోస్టర్ కూడా షేర్ చేశారు. 

తండేల్ కథేంటి? 

గుజరాత్‌ లోని సూరత్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. బోటు నడిపే వ్యక్తి బతుకుదెరువు కోసం గుజరాత్‌లోని వీరవల్‌కు వెళ్లగా..అలా సముద్రవేట లో ఉంటూ పాకిస్థాన్‌ కోస్టుగార్డుల చెరలో చిక్కుతాడు. అలా అక్కడి పాకిస్థాన్ జైలు నుంచి..తాను ప్రేమించిన వాడు ఎప్పుడొస్తాడో అని ఎదురు చూసే పాత్రలో సాయి పల్లవి నటించింది. ఇతర పాత్రల్లో ప్రకాష్ బెలవాడి, ఆడుకలం నరేన్, దివ్య పిళ్లై, కరుణాకరన్, బబ్లూ, పృథివీరాజ్, కల్ప లత, చరణ్‌దీప్, కళ్యాణి నటరాజన్ తదితరులు నటించారు.