నాగచైతన్య తండేల్ (Thandel) మూవీ రేపు శుక్రవారం (ఫిబ్రవరి 7న) రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం నాగ చైతన్య, సాయి పల్లవి తమ యాస భాషలను మార్చుకుని కొత్తగా కనిపించబోతున్నారు.
ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ విజువల్స్ ఆడియన్స్లో అంచనాలు పెంచేశాయి. చై కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కిన తండేల్ ప్రీ రిలీజ్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.
తండేల్ బడ్జెట్ & బిజినెస్:
తండేల్ మూవీని గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ దాదాపు రూ.80 నుండి 90 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించింది. అందుకు తగ్గట్టుగానే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుపుకుంది. నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలోనే తండేల్ మూవీ రూ.60 కోట్ల మేరకు బిజినెస్ చేసింది.
అందులో తండేల్ డిజిటల్ హక్కులను రూ.35 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇక చార్ట్ బ్లాస్టర్ అయిన ఆడియో రైట్స్ రూ.7 కోట్లు, హిందీ డబ్బింగ్ హక్కులు రూ.8 కోట్లు, శాటిలైట్ హక్కులు మరో రూ.10 కోట్లు మేరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
ALSO READ | లావణ్యకి డ్రగ్స్ టెస్టులు నిర్వహించాలంటూ శేఖర్ భాషా సంచలనం..
అంటే ఈ లెక్కన చూస్తే.. నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్, అత్యధిక బిజినెస్ చేసుకున్న చిత్రంగా తండేల్ నిలిచింది. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించాలంటే దాదాపు రూ.100 కోట్ల మార్కును దాటాలి.
ఇకపోతే సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత వచ్చే ఓవర్సీస్ వసూళ్లు, ఇతర భాషల వసూళ్లు లాభాలుగా రానున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో వస్తోన్న తండేల్ కు ఫస్ట్ డే పాజిటివ్ టాక్ వచ్చిందంటే.. ఇక ఓపెనింగ్ కలెక్షన్లు అదిరిపోయే ఛాన్స్ ఉంది. చూడాలి రేపు ఏం జరగనుందో!
తండేల్ కథ:
2018లో శ్రీకాకుళానికి చెందిన మత్య్సకారులు గుజరాత్‍లో చేపల వేటకు దిగి అనుకోకుండా సముద్రంలో పాకిస్థాన్ హద్దులకు వెళ్లారు. అక్కడ పాక్ సైన్యానికి పట్టుబడ్డారు. పాక్ జైలులో కొన్ని నెలల పాటు చిత్ర హింసలు అనుభవించారు. ఆ తర్వాత మళ్లీ భారత్‍కు చేరారు. వారిలో మత్స్యకారుడు రాజు కూడా ఒకరు. అతడి నిజ జీవిత కథ ఆధారంగానే తండేల్ చిత్రం రూపొందింది. ఈ కథ వెనుక ఉన్న నిజ జీవిత ప్రేరణ ప్రేక్షకులతో గాఢంగా ప్రతిధ్వనిస్తుందని ట్రేడర్స్ భావిస్తున్నారు.