గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో దారుణం జరిగింది. ఓ 19 ఏళ్ల యువకుడు.. 7 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన బుధవారం ఉదయం 7 గంటల సమయంలో జరిగింది. ‘నిందితుడు బాలికను ట్రైన్ టాయిలెట్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. వారిద్దరూ కలిసే ప్రయాణం చేస్తున్నారు. నిందితునిపై కురార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కేసు మాకు బదిలీ చేయబడింది’ అని థానే రైల్వే పోలీస్ అధికారి తెలిపారు. కాగా.. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయకపోవడం గమనార్హం.
For More News..