థానే: అంబర్నాథ్లోని ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయింది. మోరివ్లీ ఎంఐడీసీ ప్రాంతంలోని నికాచెమ్ ప్రాడక్ట్ కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 2024 సెప్టెంబర్ 12 తెల్లవారుజాము జరిగిన గ్యాస్ లీక్ ఘటనతో అంబర్ నాథ్ ప్రాంతమంతా పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. దీంతో స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళ్లమంటలు, గొంతు నొప్పితో, శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులో ఆస్పత్రుల్లో చేరుతున్నారు.
ALSO READ : వందేభారత్ మెట్రో రైళ్లు వచ్చేస్తాయ్: ఈ రైలు ప్రత్యేకలు ఏంటీ.. మెట్రో అని పేరు ఎందుకు పెట్టారు..?
కెమికల్ గ్యాస్ లీక్ తో అంబర్ నాథ్ నగరమంతా పొగలతో స్థానికులు సతమతమయ్యారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పాడ్డాయి. విషయం తెలుసుకున్న MIDC అగ్ని మాపక , వాయి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిలో అదుపులోకి తెచ్చారు. ఈ లీక్ తర్వాత పొగమంచుతో కూడిన రోడ్ల విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
#BREAKING
— Mr. Shaz (@Wh_So_Serious) September 12, 2024
A gas leak at a chemical company in Ambarnath is affecting the city, causing reduced visibility and symptoms like itchy eyes and throat irritation among residents.
Stay safe! #BreakingNews#Ambarnath #GasLeak #Maharashtra#India pic.twitter.com/gqZVwnDr40