ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం (జూలై13) కురిసిన భారీ వర్షాలకు ముంబై సీటి అంతా జలమయమయింది. సిటీలో పలు ప్రాంతాల్లో నీటమునిగాయి. భారీ వర్షాలు కురు స్తున్నం దున అంధేరీ సబ్ వేను అధికారులు మూసేశారు.ఛత్రపతి శివాజి మహారాజ్ విమానాశ్రయంలో భారీ వర్షపు నీరు చేరింది.
రానున్న రెండు మూడు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలున్నందున ముంబై, పాల్ ఘర్ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది రీజనల్ వాతావరణ శాఖ. మరోవైపు మహారాష్ట్రలోని నాలుగు జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. సతారా, కొల్హాపూర్, సింధు దుర్గ్, రాత్నగిరి జిల్లాలో భారీ కురుస్తాయని అంచనా వేసింది. రాయ్ గఢ్, పుణె ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ముంబైలో రికార్డు స్థాయిలో వర్షపాతం
శనివారం ఉదయం నుంచి ఆదివారం (జూలై 14) రోజు ఉదయం వరకు కురిసిన భారీ వర్షాలతో రికార్డు వర్షపాతం నమోదు అయింది. సగటున వర్షపాత 115.81 మి.మీ. వర్షపాతం రికార్డు అయింది. మరోవైపు ముంబైలో ఆదివారం సాయంత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ.