మహా ఇల్లాలు: భర్త ఉరేస్కుంటుంటే.. వీడియో తీసింది

మహా ఇల్లాలు: భర్త ఉరేస్కుంటుంటే.. వీడియో తీసింది
  • థానేలో ఘటన.. మహిళ అరెస్ట్  

థానే:  ఉరేసుకుంటున్న భర్తను అడ్డుకోవాల్సిన భార్య.. ఆ ఘటనను వీడియో తీసింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర థానేలోని వాగ్లే ఎస్టేట్‌ ప్రాంతంలో భార్యభర్తలు  కూలి చేసుకుంటూ నివాసం ఉంటున్నారు. వీరు తరచూ గొడవ పడేవారు. ఈ నెల 20న రాత్రి వీరి మధ్య మరోసారి గొడవ జరిగింది.

ఆవేశంలో భర్త సీలింగ్‌ ఫ్యాన్‌కు ఊరేసుకున్నాడు. అతన్ని ఆపకుండా ఆమె మొబైల్‌ ఫోన్‌లో వీడియో రికార్డు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు. అనంతరం ఆత్మహత్య చేసుకుంటున్న భర్తను అడ్డుకోకుండా వీడియో తీసిన భార్యను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.