స్వేచ్ఛ కోసం తంగలాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోరాటం

స్వేచ్ఛ కోసం తంగలాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోరాటం

విక్రమ్ హీరోగా నటించిన  పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’.  పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.  దర్శకుడు పా.రంజిత్ రూపొందించిన ఈ చిత్రాన్ని  కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఆగస్టు 15న సినిమా విడుదలవుతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని  మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు.  విక్రమ్ మాట్లాడుతూ ‘పా రంజిత్ నా ఫేవరేట్ డైరెక్టర్. ఈ కథను నా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు హ్యాపీగా ఫీలయ్యా. ఇది భాష, ప్రాంతం అని కాకుండా ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ రిలేట్ అయ్యే స్టోరీ.  

బంగారం వేట అనేది హైలైట్ అవుతున్నా.. స్వేచ్ఛ కోసం చేసే పోరాటం ఈ కథలో ఉంది.  ఇది ఒక వర్గానికి ఆపాదించలేం. మన జీవితాల్లో కూడా ఎప్పుడో ఒకప్పుడు అసమానతలకు గురవుతూ ఉంటాం. అలాంటి వారి కోసం దర్శకుడు పా రంజిత్ ఈ సినిమా ద్వారా తన అభిప్రాయాలు చెబుతున్నారు. ఈ మూవీ షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా  ఆఫ్రికన్ ట్రైబ్స్ సహా ప్రపంచంలోని కొన్ని తెగలు ఎలా ఉంటాయో  తెలుసుకున్నా.  

నాతోపాటు ఆర్టిస్టులంతా సింగిల్ షాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీన్స్ చేశాం. ఈ సినిమా అందర్నీ సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేస్తుంది’ అని అన్నాడు. నటిగా తనను తాను  ప్రూవ్ చేసుకునే కథ ఇదని చెప్పింది మాళవిక మోహనన్.  ఈ సినిమా కోసం  డైరెక్టర్ పా రంజిత్  కొత్త వరల్డ్ క్రియేట్ చేశారంది పార్వతీ తిరువోతు. హాలీవుడ్ నటుడు డేనియల్  సహా టీమ్ అంతా పాల్గొన్నారు.