Meerut Murder Case: మీరట్ హత్య ఘటనపై బాగేశ్వర్ బాబా సంచలన కామెంట్స్..

Meerut Murder Case: మీరట్ హత్య ఘటనపై బాగేశ్వర్ బాబా సంచలన కామెంట్స్..

మీరట్ మర్చంగ్ నేవీ ఆఫీసర్ హత్య కేసులో బాగేశ్వర్ బాబా సంచలన కామెంట్స్ చేశారు. పిల్లల పెంపకంలో కుటుంబాల లోపం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు సరైన విలువలు నేర్పించాలన్నారు. భయంకరమైన మీరట్ మర్డర్ కేసులో మీడియా అడిగిన ప్రశ్నలకు మతబోధకుడు బాగేశ్వర్ బాబాగా గుర్తింపు పొందిన ధీరేంద్ర కృష్ణ శాస్త్రి( రామ్ చరిత్ మానస్) ఈ వ్యాఖ్యలుచేశారు. 

మీరట్ ఉదంతం దురదృష్టకరం.. కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తుంది. వెస్టర్న్ కల్చర్, వివాహేతర సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఇవి విలువలు లోపించాయని స్పష్టంగా చెబుతున్నాయి. పిల్లలు ఇలాంటి దురదృష్టకర చర్యలకు పాల్పడితే అది పెంపకం లోపమే అని సంస్కార వంతమైన కుటుంబాలను నిర్మించేందుుకు ప్రతి భారతీయుడు కృషి చేయాలన్నారు.    

Also Read :  భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త

మీరట్లో ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య ఘటను గురించి తెలిసిందే.మర్చంట్ నేవి ఆఫీసర్ సౌరభ్ ను అతని భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలు  చంపి 15 ముక్కలు చేసి డ్రమ్ముల్లో సిమెంట్ తో కప్పి పెట్టిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

డ్రగ్స్ కు బానిసైన ముస్కాన్ రస్తోగి, సాహిల్ శుక్లాలు వారి విషయం బయటపడుతుందని సౌరభ్ ను హత్య చేశారు. లండన్ లో ఉంటున్న సౌరభ్ ..కూతురి పుట్టినరోజున మీరట్ రావడం.. అతనికి ఇష్టమైన తినే ఆహారంలో మత్తు మందు కలిపి దారుణంగా హత్య చేశారు. ప్రస్తుతం నిందితులు ఇద్దరు మీరట్ జైలులో ఉన్నారు.