అద్భుత ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్ ను సాధించిన టీమిండియాపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 140 కోట్ల భారతీయుల కలను సాకారం చేసిన టీమిండియాను.. క్రికెట్ అభిమానులు, లెంజడరీ మాజీ క్రికెటర్లు సచిన్, ఎమ్ఎస్ ధోనీ, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, సెహ్వాగ్ తోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా తమ ఆనందాన్ని పంచుకున్నారు.
టీమిండియాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ‘మన టీమ్ టీ20 వరల్డ్ కప్‌ను తమదైన స్టైల్‌లో ఇంటికి తీసుకువస్తోంది. టీమిండియాను చూసి గర్విస్తున్నాం. ఈ మ్యాచ్ చరిత్రాత్మకం’ అని ట్వీట్ చేశారు.
"అద్భుతమైన ప్రపంచ కప్ విజయం, టోర్నమెంట్ అంతటా అద్భుత ప్రదర్శన చేసినందుకు టీమ్ ఇండియాకు అభినందనలు!. సూర్య, వాటే బ్రిలియంట్ క్యాచ్!.. రోహిత్, ఈ విజయం మీ నాయకత్వానికి నిదర్శనం. రాహుల్ ద్రావిడ్.. టీమ్ ఇండియా మీ గైడెన్స్ మిస్ అవుతుందని నాకు తెలుసు. అద్భుతమైన మెన్ ఇన్ బ్లూ మన దేశం గర్వపడేలా చేసింది. అత్యుత్తమ టీ20 కెరీర్ సాధించిన విరాట్‌కు కంగ్రాట్స్" అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
Congratulations to Team India on a spectacular World Cup Victory and a phenomenal performance throughout the tournament!
— Rahul Gandhi (@RahulGandhi) June 29, 2024
Surya, what a brilliant catch! Rohit, this win is a testament to your leadership. Rahul, I know team India will miss your guidance.
The spectacular Men in… pic.twitter.com/lkYlu33egb
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా టీమిండియాను అభినందించారు. టీ20 ప్రపంచకప్ గెలిచి దేశాన్ని గర్వపడేలా చేశారని కొనియాడారు.
వరల్డ్ కప్ ఛాంపియన్స్ 2024... ప్రశాంతంగా ఉండటం, ఆత్మవిశ్వాసంతో మీరు అద్భుతమైన ప్రదర్శన చేయడంతో నా హృదయ స్పందన బాగా పెరిగింది. ప్రపంచ కప్‌ని ఇంటికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. ప్రపంచంలోని భారతీయులందరి తరుపున అభినందనలు.. వెలకట్టలేని పుట్టినరోజు బహుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు" అని ధోని తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశాడు. కాగా, జూలై 7న ధోని పుట్టినరోజు వస్తుంది.
Every star added to the Team India jersey inspires our nation’s starry-eyed children to move one step closer to their dreams. India gets the 4th star, our second in @T20WorldCup.
— Sachin Tendulkar (@sachin_rt) June 29, 2024
Life comes full circle for Indian cricket in the West Indies. From our lows in the 2007 ODI World… pic.twitter.com/HMievynpsE
"2011 ప్రపంచ కప్ ను కోల్పోయినా.. టీ20 ప్రపంచకప్ 2024 విజయంతో నా స్నేహితుడు రాహుల్ ద్రవిడ్ కల నెరవేరింది. ద్రావిడ్ చూస్తే చాలా సంతోషంగా ఉంది. రోహిత్ శర్మ గురించి ఏమి చెప్పగలరు.. అద్భుతమైన కెప్టెన్సీ! 2023 ODI ప్రపంచ కప్ ఓటమి తర్వాత ఆటగాళ్లందరినీ T20 ప్రపంచ కప్ కోసం మోటివేట్ చేసిన తీరు అభినందనీయం. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుకు జస్ప్రీత్‌బుమ్రా, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు విరాట్ కోహ్లీ ఇద్దరూ అర్హులే. రాహుల్ నాయకత్వంలో టీమ్ ఇండియా రాణించడం అద్భుతం. ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, అందరికీ హృదయపూర్వక అభినందనలు" అని టెండూల్కర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
టీ20 ప్రపంచ చాంపియన్ 2024గా నిలిచిన భారత్ కు రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, యూసఫ్ పఠాన్ వంటి మాజీ క్రికెటర్లు అభినందనలు తెలిపారు. అద్భుత ప్రదర్శన చేసి భారతీయుల కలను నెరవేర్చారంటూ ప్రశంసించారు. టీమిండియాను చూసి దేశం గర్విస్తోందని అన్నారు.
Congratulations Team India on becoming the T20 World Champions. Been the best team in the tournament remaining unbeaten throughout.
— VVS Laxman (@VVSLaxman281) June 29, 2024
Great composure and character shown by the team to win this from the situation we were in with 5 overs remaining.
Every player deserves credit… pic.twitter.com/hE79AeHx8e
Like in stocks, there is a breakout after consoldation in a range, where after resistance for years there is a multiyear breakout and it reaches new highs, I have a feeling that this is a breakout win for us.
— Virender Sehwag (@virendersehwag) June 30, 2024
For years, we have played well , been consistent in a range,… pic.twitter.com/Db7D9l5zsM
Heartiest congratulations to Rohit sharma and his team .. what a game to win .. may be a World Cup in 11 yrs but the talent the country has ,they will win many more .. Bumrah is absolutely magic .. well done Virat,axar ,Hardik and every one .. rahul Dravid and the support staff…
— Sourav Ganguly (@SGanguly99) June 29, 2024
పలువురు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా టీమిండియాకు అభినందనలు తెలిపారు.
కాగా.. చివరి బాల్ వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ లో సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో టీమిండియా విక్టరీ సాధించింది. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలిచింది భారత్. విరాట్ కోహ్లీ 76 పరుగులు అద్భుతంగా ఆడాడు. అటు అక్షర్ 47 పరుగులు చేసి అదరగొట్టాడు. శివమ్ దూబె 27 పరుగులు రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో మహరాజ్, నోర్ట్జేలకు చెరో రెండు వికెట్లు, రబడ, జాన్సెన్ లకు తలో వికెట్ పడింది.
దక్షిణాఫ్రికా బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ 52, డికాక్ 39 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో హార్థిక్ పాండ్యా 32, బూమ్రా 2, అర్షదీప్ సింగ్ 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు. చివరి ఓవర్ లో అద్భుత క్యాచ్ తో సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు.