లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో వరుస హిట్స్ కొట్టిన అక్కినేని నాగచైతన్య.. థాంక్యూ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన రాశీ ఖన్నా కనిపించనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న థాంక్యూ సినిమాకు సంబంధించి ఇప్పటికే పోస్టర్లు రిలీజ్ కాగా.. ఎట్టకేలకు టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. మే 25 సాయంత్రం 5.04గంటలకు టీజర్ రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. దీనికి సంబంధించి అనౌన్స్ మెంట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న థాంక్యూ సినిమాలో నాగ చైతన్య మూడు డిఫరెంట్ రోల్స్లో కనిపించనున్నట్లు సమాచారం. రాశీ ఖన్నా హీరోయిన్గా కనిపించనున్న ఈ సినిమాలో అవికా గోర్, మాళవికా నాయర్ కూడా నటించారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను జులై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.