కునాల్ కమ్రాకు అండగా ఫ్యాన్స్.. లక్షల్లో విరాళాలు..

కునాల్ కమ్రాకు అండగా ఫ్యాన్స్.. లక్షల్లో విరాళాలు..

స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఎకనాథ్ షిండేపై వేసిన సెటైర్లు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.. కునాల్ వ్యాఖ్యలకు నిరసనగా శివసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. కునాల్ కమ్రాకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ అండగా నిలుస్తున్నారు. షిండేపై న్యాయపోరాటానికి మద్దతుగా కమ్రాకు లక్షల్లో విరాళాలు ఇస్తున్నారు ఫ్యాన్స్. ఇండియన్ రూపీలోనే కాకుండా బ్రిటీష్ పౌండ్స్, యూఎస్ డాలర్స్, కెనడియన్ డాలర్స్, యూఏఈ దిరమ్స్ లలో విరాళాలు ఇస్తూ..  ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ కునాల్ కి మద్దతుగా నిలుస్తున్నారు.

రూ. 400 నుంచి రూ. 10వేల విరాళాలు ఇచ్చిన ఫ్యాన్స్..  కునాల్ ఫండ్ రైజర్ ప్రోగ్రాం స్టార్ట్ చేయాలని కోరుతూ కామెంట్ చేస్తున్నారు. స్టాండప్ కామెడీ ద్వారా హ్యూమర్ ని పంచడం మాత్రమే కాకుండా నిజాయితీగా, నిబద్దతతో తన వాయిస్ వినిపిస్తున్నారంటూ మరికొంతమంది ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కామెడీని కూడా జర్నలిజం కోణంలో పంచుతున్నందుకు కునాల్ ను అభినందిస్తున్నారు ఫ్యాన్స్. 

ALSO READ : చత్తీస్ గఢ్ మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు

ప్రస్తుతం 2.4 మిలియన్ సబ్స్ క్రైబర్స్ ఉన్న కునాల్ కమ్రా యూట్యూబ్ ఛానల్ కి ఈ వివాదంతో ఫ్యాన్స్ నుండి పెద్దఎత్తున మద్దతు లభించటమే కాకుండా రీచ్ కూడా గణనీయంగా పెరిగిందనే చెప్పాలి.