సీఎం, ఆరోగ్య శాఖమంత్రికి థాంక్స్​.. సమగర (మోచి) కుల సంఘం చైర్మన్​ రాజమౌళి

సీఎం, ఆరోగ్య శాఖమంత్రికి థాంక్స్​.. సమగర (మోచి) కుల సంఘం చైర్మన్​ రాజమౌళి

బషీర్​బాగ్, వెలుగు: చెప్పులు కుట్టుకొనే తాము విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో అవకాశం దక్కక అన్యాయానికి గురయ్యామని సమగర (మొచి) కుల సంఘం చైర్మన్​డా.రాజమౌళి చెప్పారు. తమను ఎస్సీ వర్గీకరణలో బి క్యాటగిరీలో చేర్చడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సీఎం రేవంత్​రెడ్డి, ఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహకు ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఆయన బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. 30 ఏండ్ల పోరాటాన్ని గుర్తించి ఎస్సీ వర్గీకరణను చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చిందని కొనియాడారు. కుల సంఘం లీడర్లు రమేశ్, దశరథ్ వాగ్మరేయ్ , దేవేంద్రప్ప, రవీందర్, భాస్కర్ , నోమురాజు పాల్గొన్నారు.