మిల్కీ బ్యూటీ తమన్నా, గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్స్ గా వచ్చిన లేటెస్ట్ మూవీ అరణ్మనై 4. తెలుగులో బాక్ పేరుతో విడుదలైంది ఈ మూవీ. దర్శకుడు సుదర్ సి తెరకెక్కించే అరణ్మనై సిరీస్ కు తమిళంలో మంచి స్పందన ఉంది. ఈ సిరీస్ చిత్రాలు అక్కడి ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందులో భాగంగా వచ్చిన సినిమానే అరణ్మనై 4. ఐపీఎల్, ఎలక్షన్స్ వంటి టఫ్ సీజన్ లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.
అయితే తెలుగులో మాత్రం ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. తమిళంలో మాత్రం రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది అరణ్మనై 4. దీంతో ఈ సిరీస్ లో వచ్చిన మరో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది అరణ్మనై 4. ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగియడంతో ఓటీటీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇదే విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. తాజాగా సమాచారం మేరకు ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ జూన్ 21 నుండి బాక్ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. దీంతో ఈ సినిమాను థియేటర్స్ లో మిస్ అయిన ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి థియేటర్స్ లో అంతగా ఆకట్టుకొని బాక్ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వష్తుందో చూడాలి.
ఇక బాక్ సినిమా కథ విషయానికి వస్తే.. శివాని (తమన్నా) కొన్ని కారణాల వల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది. ఆతరువాత కొన్నిరోజులకే ఆమె కూడా చనిపోతాడు. తన చెల్లెలిది సాధారణమైన మరణం కాదని, ఏదో కారణం ఉందని భావించిన లాయర్ శివ శంకర్ (సుందర్.సి) ఆ దిశగా ఇన్వెస్టిగేట్ మొదలుపెడతాడు. ఆ ఇన్వెస్టిగేషన్ లో శివ శంకర్ కు నమ్మలేని నిజాలు తెలుస్తాయి? మరి ఆ నిజాలు ఏంటి? శివాని ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? అనేది మిగిలిన కథ.