బాలీవుడ్(Bollywood) నటి సుస్మితా సేన్(Sushmita Sen)పై దర్శకనిర్మాతలు ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ నటి తాళి(Taali) అనే సిరీస్ లో ట్రాన్స్ జెండర్‌గా నటిస్తోంది. ఈ మూవీ టీం తాజాగా మాట్లాడుతూ.. అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ఆమె తమ షూటింగ్లో పాల్గొన్నారని తెలిపింది. ఇటీవల సుస్మితా గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే.
దీంతో ఆమె గుండెకు స్టంట్ వేశారు. విశ్రాంతి అవసరమైన ఈ టైంలో సుస్మిత తన సినిమాపై ఎంతో డెడికేషన్ చూపిందని టీం తెలిపింది. ఈ చికిత్స చేయించుకున్న ఎనిమిదో రోజే ఆమె తిరిగి సెట్‌కు చేరుకున్నారని తెలిపింది. మూవీ డబ్బింగ్లో భాగంగా గట్టిగా అరవాల్సిన సీన్లు ఉండేవి. అయినా ఇవేవీ తాను లెక్కచేయలేదు అంటూ తాళి టీం తెలిపింది.
ట్రాన్స్ జెండర్ల హక్కుల కోసం పోరాడిన శ్రీ గౌరి సావంత్(Shreegauri Sawant) జీవితం ఆధారంగా రవి జాదవ్ దీనిని తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లో సుస్మితా ఆకట్టుకుంది. ఈ నెల 15 నుంచి జియోలో స్ట్రీమ్ కానుంది.